Dhanush: తెరపైకి అబ్దుల్ కలాం బయెపిక్.. మిస్సైల్ మ్యాన్‏గా కనిపించనున్న ధనుష్.. డైరెక్టర్ ఎవరంటే..

తమిళ్ స్టార్ హీరో ధనుష్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున, రష్మిక మందన్నా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతోపాటు అటు దర్శకుడిగానూ వరుస సినిమాలను రూపొందిస్తున్నారు.

Dhanush: తెరపైకి అబ్దుల్ కలాం బయెపిక్.. మిస్సైల్ మ్యాన్‏గా కనిపించనున్న ధనుష్.. డైరెక్టర్ ఎవరంటే..
Dhanush

Updated on: May 22, 2025 | 3:26 PM

కోలీవుడ్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కుబేర చిత్రంలో నటిస్తున్న ధనుష్.. మ్యాజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నారు. గతేడాది ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ధనుష్ మరో బయోపిక్ చేయనున్నట్లు తెలుస్తోంది. భారత మాజీ రాష్ట్రపతి, ఇస్రో శాస్త్రవేత్త అబ్దుల్ కలాం జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఆయన స్పూర్తిదాయకమైన జీవితాన్ని ఇప్పుడు అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. కలార్ పేరుతో ఈ సినిమాను రూపొందించనున్నారు. అలాగే మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేది ట్యాగ్ లైన్. ఇందులో మిస్సైల్ మ్యాన్ పాత్రలో కోలీవుడ్ హీరో ధనుష్ కనిపించనున్నారు.

కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహించనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, టీ సిరీస్ సంస్థలు ఈ క్రేజీ ప్రాజెక్టును సంయుక్తంగా నిర్మించనున్నారు. “రామేశ్వం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఒక లెజెండ్ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇండియన్ మిస్సైల్ మ్యాన్ వెండితెరపైకి వస్తున్నాడు. పెద్దగా కలలు కనండి. మరింత ఎత్తుకు ఎదగండి” అంటూ ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు డైరెక్టర్ ఓంరౌత్.

డైరెక్టర్ ఓంరౌత్.. చివరగా ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమాను రూపొందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతంగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాను తెరకెక్కించి విమర్శలు ఎదుర్కొన్నారు డైరెక్టర్ ఓంరౌత్. రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆదిపురుష్ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ ఓంరౌత్.. ఇప్పుడు అబ్దుల్ కలాం బయోపిక్ అధికారికంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..