విక్రమ్ చియాన్. తమిళ ప్రేక్షకులకే తెలుగు వారికి సుపరిచితమే. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికులలో విక్రమ్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించారు. హీరోయిజం మాత్రమే కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సరికొత్త సాహాసాలు చేసేందుకు ముందుంటాడు విక్రమ్. ప్రస్తుతం ఈ హీరో కోబ్రా మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ మూవీ ట్రైలర్ ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ 25 లుక్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కోబ్రా టీజర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గోన్న విక్రమ్ అల్లు అర్జున్ నటించిన పుష్ప (Pushpa) సినిమాలోని ఫేమస్ డైలాగ్‌ను 10 వెరియేషన్స్‌లో చెప్పి అదుర్స్ అనిపించాడు.
పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైరూ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌ను తాజాగా విక్రమ్ 10 రకాలుగా చెప్పారు. దీంతో అభిమానులు షాకయ్యారు. కోపం, భయం, కామెడీ అంటూ ఒకే డైలాగ్‌తో పది రకాల వెరియేషన్స్ చూపించారు విక్రమ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కోబ్రా చిత్రంలో భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో జానకిరామన్, మియా, మాముక్కోయా, కెఎస్ రవికుమార్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
#Pushpa Dialogue by #ChiyaanVikram ??
Aparichitudu Variations ??@alluarjun @chiyaan @PushpaMoviepic.twitter.com/fyhGZCoDHB— Allu Arjun FC (@AlluArjunHCF) August 24, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.