కొంచెం టిపికల్‌గా యాక్టింగ్ చేస్తే చాలు టాలీవుడ్ మస్త్ ఎంకరేజ్ చేస్తుంది. అలాంటి నటుల కోసం ప్రత్యేకమైన పాత్రలు సృష్టిస్తారు మేకర్స్. ఆ కోవకు చెందన వ్యక్తే.. చంద్రశేఖర్. రాజమౌళి సినిమాల్లో కీలక పాత్రలు అందుకుని.. విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్నాడు ఈ యాక్టర్. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించడంతో.. అప్పట్నుంచి అతడ్ని ఛత్రపతి శేఖర్‌గా పిలవడం ప్రారంభించారు జనాలు. సినిమాల్లోకి రాకముందు పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేశాడు శేఖర్. విలనిజం అయినా, కామెడీ అయినా, ఎమోషన్ అయినా.. తమ మార్క్ చూపిస్తాడు శేఖర్. అయితే అతని వైఫ్ గురించి మీకు తెల్సా..? తను కూడా ఇండస్ట్రీకి చెందినవారే. శేఖర్ వైఫ్ ఓ నటి అని చాలామందికి తెలీదు. ఆమె పేరు నీల్య భవాని.
నీల్య భవాని కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను అలరించారు. అలాగే పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేశారు. ఛత్రపతి శేఖర్, నీల్య భవాని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కొన్నాళ్లు వారి బంధం మంచిగానే సాగింది. ఆతర్వాత ఇద్దరి మధ్య విబేధాల రావడంతో విడిపోయారు. ఇప్పుడు విడి విడిగా ఉంటూ ఎవరి లైఫ్ వాళ్లు లీడ్ చేస్తున్నారు.
చాలా మందికి నీల్య భవాని పేరు తెలియదు.. కానీ ఆమెను చూస్తే సినిమాలు చూసేవారు వెంటనే గుర్తుపడగారు. పండగ చేస్కో, కిక్ 2 ,సైరా, జెంటిల్ మ్యాన్ లాంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె తెలంగాణలోని ఖమ్మం ప్రాంతానికి చెందినవారు. ఈమె సోషల్ మీడియాలోనూ పెద్ద యాక్టివ్‌గా ఉండదు. ఆమె గతంలో ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఫోటోలు తాజాగా మరోసారి ట్రెండ్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.