మోస్ట్ ఏవైటింగ్ మూవీ ది వారియర్(The Warriorr) సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో రిలీజ్ అవుతోన్న విషయం తెలిసిందే. రాన్, పందెం కోడి, ఆవారా సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో ఈ సినిమారాబోతుంది. ఈ సినిమాలో రామ్ కు జోడిగా కృతిశెట్టి నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ మొదటి సారి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న భారీ ఎత్తున సినిమా విడుదలఅవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు బ్రహ్మాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ..’నాకు ఇష్టమైన దర్శకుడు లింగుస్వామి గారు. ‘రన్’ సినిమా చూసినప్పటి నుంచి ఆయనకు ఫ్యాన్ అయ్యా అన్నారు. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి నాకు బాగా పరిచయం. రామ్‌తో సినిమా చేస్తున్నారని తెలిసి నేనే ఆఫీసుకు వెళ్లి కలిశా.. అలాగే లింగుస్వామి గారు డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇక ఈ సినిమాలో రామ్ పెర్ఫార్మన్స్ చూసి ఫ్యాన్ అయిపోయా. తెలుగులో డైలాగులు ఎంత బాగా చెప్పాడో.! తెలుగు కన్నా తమిళంలో అద్భుతంగా చెప్పాడు. తమిళంలోనూ ప్రతి సీన్ సింగిల్ టేక్‌లో చేశాడు. బాలీవుడ్‌లో ఉండాల్సిన రామ్ మన తెలుగులో, మనతో యాక్ట్ చేయడం అదృష్టం. రియల్లీ చాలా టాలెంటెడ్. తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీస్తే..తమిళంలో వేరే ఆర్టిస్టును తీసుకుంటారు కానీ తమిళంలో కూడా నాతో రోల్ చేయించారు” అని చెప్పుకొచ్చారు బ్రహ్మాజీ.