AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో భోళా శంకరుడు.. నాన్నకు క్యాన్సర్ అని 5వేలు అడిగా.. ఆయన చేసిన పనికి షాకయ్యా.. హీరో భాను చందర్..

ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలో హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో మెప్పించారు భాను చందర్. ముఖ్యంగా ఆయన కెరీర్ మలుపు తిప్పిన సినిమా నిరీక్షణ. ఈ చిత్రం అప్పట్లో ఎంత విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఆ హీరో భోళా శంకరుడు.. నాన్నకు క్యాన్సర్ అని 5వేలు అడిగా.. ఆయన చేసిన పనికి షాకయ్యా.. హీరో భాను చందర్..
Bhanu Chander
Rajitha Chanti
|

Updated on: May 19, 2026 | 11:04 AM

Share

టాలీవుడ్ నటుడు భానుచందర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిరీక్షణ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఆయన..ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో భానుచందర్ మాట్లాడుతూ. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) , అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్‌ఆర్) లతో తనకున్న అనుబంధం గురించి వివరించారు. తన తండ్రికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎదురైన క్లిష్ట పరిస్థితిని ఆయన వివరించారు. ఆపరేషన్ కోసం రూ.5,000 అవసరమయ్యాయని, అయితే తన మొదటి సినిమాకు రూ.500 అడ్వాన్స్ మాత్రమే వచ్చిందని, మిగిలిన రూ.4,500 కోసం రామారావుని చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లి కలిశానని తెలిపారు. అనేక మంది నిర్మాతలు, దర్శకులు క్యూలో ఉన్నప్పటికీ, తాను వేణు అబ్బాయి అని చెప్పగానే రామారావు తనను లోపలికి పిలిచారని అన్నారు. తన పరిస్థితి వివరించగానే, “ఓకే, వీ విల్ సీ. యూ క్యారీ ఆన్” అని రామారావు చెప్పారని, దీంతో నిరాశతో తిరిగి వచ్చానని భాను చందర్ చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

అయితే, ఇంటికి చేరుకునేలోపే రూ.4,500 రామారావు నుంచి తన ఇంటికి చేరాయని, ముద్దు కృష్ణారెడ్డి ద్వారా తండ్రికి ఆపరేషన్ చేయించగా, ఆయన మరో ఏడాదిన్నర జీవించారని భాను చందర్ గుర్తు చేసుకున్నారు. రామారావు “బోళా శంకరుడు” అని, “చిన్న పసిపిల్లాడి మనస్తత్వం” కలవారని అన్నారు. డ్రైవర్ హరే కృష్ణతో రామారావు స్నేహబంధం, సెట్‌లో సరదాగా సిగరెట్ పంచుకోవడం వంటి వ్యక్తిగత విషయాలను కూడా భాను చందర్ పంచుకున్నారు.

అలాగే, అక్కినేని నాగేశ్వరరావు గొప్ప మనసును చాటుతూ ఒక హృదయ విదారకమైన సంఘటనను భాను చందర్ వివరించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ ఇద్దరూ మేకప్ నాగేశ్వరరావు అనే కళాకారుడి ఇంటికి వెళ్లి మేకప్ వేయించుకునేవారని తెలిపారు. మేకప్ నాగేశ్వరరావు అబ్బాయి సుదర్శన్ తన ఆప్తమిత్రుడని, అతను అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక నర్సింగ్ హోమ్‌లో చేరినప్పుడు, సుదర్శన్ తన తండ్రిని పరామర్శించమని కోరాడని భాను చందర్ చెప్పారు. మేకప్ నాగేశ్వరరావుతో మాటల సందర్భంలో, ఏఎన్‌ఆర్ తన అభిమాన హీరో అని ఆయన తెలిపారని, వెంటనే తాను నాగేశ్వరరావుకి ఫోన్ చేసి, తన మిత్రుడి తండ్రిని పరామర్శించవలసిందిగా కోరానని వివరించారు. నాగేశ్వరరావు ఎలాంటి సంకోచం లేకుండా “నాగేశ్వరరావు నా స్నేహితుడు, ఇది నా బాధ్యత” అని వెంటనే నర్సింగ్ హోమ్‌కు వచ్చి, ఆసుపత్రిలో ఉన్న మేకప్ నాగేశ్వరరావును పరామర్శించారని గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించిందని, నాగేశ్వరరావు తన కారులోనే భాను చందర్‌ను తిరిగి హోటల్‌కు దింపి వెళ్లారని భాను చందర్ ఎమోషనల్‌గా చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

 

Follow Us