Balakrishna: సింహాచలం ఆలయానికి అఖండ చిత్రయూనిట్.. శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న బాలకృష్ణ..

|

Dec 09, 2021 | 11:28 AM

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ

Balakrishna: సింహాచలం ఆలయానికి అఖండ చిత్రయూనిట్.. శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న బాలకృష్ణ..
Balakrishna
Follow us on

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ అఖండ విజయం సాధించింది. గత రెండుళ్లుగా ఢీలా పడిపోయిన థియేటర్లకు తిరిగి ఫుల్ జోష్ తీసుకువచ్చింది అఖండ. రోజులు గడుతున్నా.. అన్ స్టాపబుల్ అంటూ థియేటర్ల దుమ్ము దులుపుతుంది ఈ సినిమా. ఇక బాలయ్య నట విశ్వరూపం చూపించారు. నందమూరి అభిమానుల ప‌ల్స్ తెలిసిన బోయ‌పాటి ఈ సినిమాలో బాలయ్య‌ను ఇంతకు ముందెన్నడూ చూడని స‌రికొత్త‌పాత్ర‌లో చూపించడంతో  అఖండ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తమన్‌ మ్యూజిక్.. బాలయ్య మ్యాజిక్‌తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఫుల్ ఖుషిలో ఉన్నారు హీరో బాలకృష్ణ. అఖండ భారీ విజయం అందుకున్న సందర్భంగా హీరో బాలకృష్ణ.. గురువారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా స్వామిని దర్శించుకున్నారు.

అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశాం. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియచేసుకునేందుకు వచ్చాము. సంవత్సరం తొమ్మిది నెలలు తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించారు. ఘన విజయం అందించారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఇది మా విజయం కాదు.. చిత్ర పరిశ్రమ విజయం అన్నారు బాలకృష్ణ. అలాగే ఈ సినిమా అందుకున్న విజయంతో చిత్రపరిశ్రమకు ఒక దైర్యం వచ్చిందని.. మంచి సినిమాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారని.. తమ చిత్రాన్ని ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా.. ఫ్యాన్స్ రచ్చ ..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో అరాచకం.. ఆడపిల్లపై మెంటల్ టార్చర్.. సుప్రీం కోర్టులో కేసు వేస్తానంటున్న మాధవీలత..

Megastar Chiranjeevi: స్పీడ్ పెంచిన మెగాస్టార్.. మరో ప్రాజెక్ట్‏కు చిరు గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే..

Upasana: జీవితంలోనే ప్రత్యేకమైన రోజు.. చెల్లెలు పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన ఉపాసన.. రాయల్ ‏లుక్‏లో చరణ్..