Babu Mohan: ఆ సినిమా తర్వాతే నా లైఫ్ మారిపోయింది.. వెంటనే 10 ఆఫర్స్ వచ్చాయి.. బాబు మోహన్..

ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్యనటులలో బాబు మోహన్ ఒకరు. ముఖ్యంగా తెలుగులో బాబు మోహన్, కోట శ్రీనివాస్ రావు కాంబోకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ నటుడిగా, విలన్ గా మెప్పిస్తున్నారు. అయితే తన జీవితాన్ని ఓ సినిమా మార్చేసిందని అన్నారు.

Babu Mohan: ఆ సినిమా తర్వాతే నా లైఫ్ మారిపోయింది.. వెంటనే 10 ఆఫర్స్ వచ్చాయి.. బాబు మోహన్..
Babu Mohan

Updated on: Jan 24, 2026 | 1:00 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమ కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను అలరించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులలో బాబు మోహన్ ఒకరు. తక్కువ సమయంలోనే సినీరంగంలో తమదైన ముద్ర వేశారు. ఒకప్పుడు నటుడిగా, హస్యనటుడిగా, విలన్ గా నిటంచి మెప్పించారు. ముఖ్యంగా కోట శ్రీనివాస్ రావు, బాబు మోహన్ కాంబోకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న బాబుమోహన్.. ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంకుశం సినిమా తన జీవితంలో ఒక మైలురాయి అని, ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే పది చిత్రాలకు తాను సైన్ చేసినట్లు వెల్లడించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ తనకు సినీ గురువు అని, ఆయన రోడ్డుపై పోయేటోడిని పిలిచి నటుడిని చేశారని బాబు మోహన్ కృతజ్ఞతగా గుర్తుచేసుకున్నారు. దాసరి నారాయణరావు తన సినీ డేట్లను ఎలా సర్దుబాటు చేసుకోవాలో నేర్పించారని పేర్కొన్నారు.

నటుడిగా మాత్రమే కాకుండా, రాష్ట్రానికి మాజీ మంత్రిగా ప్రజలకు సేవ చేసిన ఆయన, తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను వివరించారు. గత ఐదారు నెలలుగా తన ఆహారపు అలవాట్లను మార్చుకున్నట్లు తెలిపారు. మాంసాహారాన్ని పూర్తిగా మానేసి, పండ్లు, పండ్ల రసాలు, రాగి జావ వంటి వాటిని మాత్రమే తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒకప్పుడు మాంసాహార ప్రియుడిని అయిన తాను, ఇప్పుడు అది లేకుండానే ఉండగలుగుతున్నానని వివరించారు. ఒకసారి చికెన్ తిని చూడాలని అనిపించినా, దానిని చూసి “వద్దు” అనిపించిందని అన్నారు.

ఒకప్పుడు రోజుకు 30-35 పాన్‌లు తినేవాడిని అని, రాజశేఖర్ లాగా “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అన్నట్లుగా తన నిర్ణయం ఉంటుందని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులు పాన్‌లో విషం కలిపి తనకు ఇవ్వబోయిన ఒక సంఘటనను ఆయన వెల్లడించారు. సంగారెడ్డిలో పాన్ తింటుండగా, ఎస్పీ గారి ఫోన్ వచ్చి పాన్‌లో విషం ఉందని, తినవద్దని హెచ్చరించారు. ఆ తర్వాత ఒక మహిళ కూడా ఫోన్ చేసి ఏడుస్తూ విషం ఉందని చెప్పడంతో, అప్పటి నుండి పాన్ తినడం పూర్తిగా మానేశానని, అదంతా భగవంతుడి దయ అని పేర్కొన్నారు. ఒకసారి బరువు తగ్గి సన్నగా ఉన్నప్పుడు, దర్శకుడు కోడి రామకృష్ణ “మాకు పాత బాబు మోహన్ గారు కావాలి, బొద్దుగా ఉండాలి” అని చెప్పి మళ్ళీ బరువు పెరిగేలా ప్రోత్సహించారని ఆయన సంతోషంగా గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..