Arun Vijay: మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్న అరుణ్ విజయ్.. నయా మూవీకి ఏనుగు అనే టైటిల్

|

Jun 11, 2022 | 11:25 AM

హీరో సూర్య తో సింగం సిరీస్ , విశాల్ తో పూజ వంటి యాక్షన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు హరి.

Arun Vijay: మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్న అరుణ్ విజయ్.. నయా మూవీకి ఏనుగు అనే టైటిల్
Enugu
Follow us on

హీరో సూర్య తో సింగం సిరీస్ , విశాల్ తో పూజ వంటి యాక్షన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు హరి. తాజాగా ఆయన దర్శకత్వం మరో ఇంట్రస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్యానర్ విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మించిన తమిళ “యానై” సినిమాను తెలుగులో “ఏనుగు” పేరుతో విడుదల చేస్తున్నారు.ఈ చిత్రంలో అరుణ్ విజయ్(Arun Vijay), ప్రియా భవానీ శంకర్,సముద్రఖని, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, అమ్ము అభిరామి వంటి సీనియర్ నటులు నటిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 17 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ..

సింగం సిరీస్ లతో పోలీస్ అంటే ఇలా ఉంటాడా అని తెలుగు ప్రేక్షకులకు సరికొత్త యాక్షన్ ను పరిచయం చేసిన దర్శకుడు హరి. మళ్ళీ అయన దర్శకత్వంలో “ఏనుగు” చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము అన్నారు. ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. ఈ సినిమాలో సముద్రఖని, KGF రామచంద్ర రాజు, రాధిక శరత్‌కుమార్ వంటి ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ తో ఇందులో నటిస్తుండడం విశేషం. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రి రిలీజ్ ను ఈ నెల 12 న జరుపుకొని ఇదే నెల 17 న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తన్నాము. మంచి కంటెంట్ తో ఫస్ట్ లైన్ ఎంటర్ టైన్ చేయడానికి వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని  సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి .