అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య సర్జా నిశ్చితార్థం అక్టోబర్ 27 చెన్నైలో ఘనంగా జరిగింది. ధృవ సర్జాతో పాటు సర్జా కుటుంబ సభ్యులు ఘనంగా నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఐశ్వర్య సర్జా తన బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోబోతుంది. ప్రముఖ తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య నిశ్చితార్థం జరిగింది. తంబి రామయ్య తమిళ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు అలాగే సహాయ నటుడిగాను సినిమాలు చేశారు. తంబి రామయ్య చాలా ఏళ్లుగా తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ఉమాపతి రామయ్య, ఐశ్వర్య సర్జా చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పెద్దల అంగీకారం తో పెళ్లికి సిద్ధమయ్యారు. తాజాగా వీరు తాజాగా కుటుంబ పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.
అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య సర్జా 2013లో ‘పట్టట్టు యానై’ అనే తమిళ సినిమా ద్వారా నటిగా తెరంగేట్రం చేసింది. 2018లో ‘ప్రేమ బరా’ అనే కన్నడ సినిమా ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇదే సినిమా తమిళంలో ‘సొల్లివిడువా’గా విడుదలైంది. ఈ చిత్రానికి అర్జున్ సర్జా స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించారు. అయితే ఆ సినిమా తర్వాత ఐశ్వర్య ఏ సినిమాలోనూ నటించలేదు.
ఐశ్వర్య పెళ్లి చేసుకోబోతున్న ఉమాపతి రామయ్య కూడా సినీ నటుడే. 2017లో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఉమాపతి రామయ్య 2021 వరకు కేవలం నాలుగు సినిమాల్లోనే నటించారు. సర్వైవర్ తమిళ్ అనే రియాల్టీ షోలో కూడా పాల్గొన్నాడు. ఐశ్వర్య, ఉమాపతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి వేడుక కూడా చెన్నైలోనే జరిగే అవకాశం ఉంది. ఇక ఈ ఇద్దరి ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి