
గతేడాది డిసెంబర్ లో అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లతో కలిసి ఏడుడుగులు నడిచాడు. ఇప్పుడు వీరి ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని అఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. జైనాబ్ రవ్డీతో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. నాగ చైతన్య వివాహం జరిగిక కొన్ని రోజులకే అఖిల్ అక్కినేని నిశ్చితార్థం చేసుకున్నాడు. జైనాబ్ తో అఖిల్ ఉంగరాలు మార్చుకున్నట్లు నాగార్జున సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పుడీ ప్రేమ జంట పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జూన్ 6న అఖిల్- జైనాబ్ ల వివాహం జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగ చైతన్య వివాహం లాగానే అఖిల్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగానే జరగనుంది. అఖిల్ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా అఖిల్, జైనబ్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు పెద్దల అనుమతితో గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఎంగేజ్ మెంట్ తర్వాత ఈ జంట పలుమార్లు కలిసి కనిపించింది. అలాగే కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అఖిల్ లెనిన్ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?
Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.