
కోలీవుడ్ హీరో అజిత్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంలో ఇప్పటివరకు దాదాపు 63 చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ముందు విడుదలైన విడాముయార్చి సైతం మెప్పించింది. ఇటు సినిమాల్లో నటిస్తూనే అటు తనకు ఇష్టమైన కార్ రేసింగ్ లో పాల్గొంటున్నాడు అజిత్. ఇప్పటివరకు అతడు ప్రపంచవ్యాప్తంగా జరిగిన 3 కార్ రేసుల్లో పాల్గొని గెలిచాడు. ఆయన పాల్గొన్న మూడు పోటీలలో.. 2 పోటీల్లో 3వ స్థానాన్ని, ఒక పోటీలో 2వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం తన టీంతో కలిసి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు అజిత్.
అజిత్ కార్ రేసింగ్ ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా తన అభిమానుల కోసం సరికొత్త సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు అజిత్. అదే సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం. “అజిత్ కుమార్ రేసింగ్” పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఛానల్ ను 2025 మే 24న మధ్యాహ్నం 12.30 గంటలకు స్టార్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అజిత్ కార్ రేసింగ్, ఇంటర్వ్యూలకు సంబంధించిన అన్ని విషయాలను ఈ ఛానల్లో ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియాకు దూరంగా ఉండే అజిత్.. ఇప్పుడు ఉన్నట్లుండి సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చూసి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అజిత్ సినిమాలకు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు అజిత్ కొత్త సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది.
Ajith Kumar Racing goes live from Misano
We’re all set to race in the Creventic Endurance Series – catch the action live on our official YouTube channel.Endurance. Speed. Precision. This is Ajith Kumar Racing.
Location: Misano World Circuit
Time: 12:30 PM today
Watch here:… pic.twitter.com/ZxdCbWIGWC— Ajithkumar Racing (@Akracingoffl) May 24, 2025
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..