Actor Ajay : ఆ సినిమా తర్వాతే నా లైఫ్ మారిపోయింది.. ఎక్కువ పారితోషికం వచ్చింది.. ఆఫర్స్ క్యూ కట్టాయి.. నటుడు అజయ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్. కొన్నాళ్లపాటు విలన్ పాత్రలతో భయపెట్టిన అజయ్.. ఆ తర్వాత తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించాడు. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉంటున్నారు. ఇటీవల తన సినీప్రయాణంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Actor Ajay : ఆ సినిమా తర్వాతే నా లైఫ్ మారిపోయింది.. ఎక్కువ పారితోషికం వచ్చింది.. ఆఫర్స్ క్యూ కట్టాయి.. నటుడు అజయ్..
Actor Ajay

Updated on: Jan 26, 2026 | 8:04 PM

టాలీవుడ్ నటుడు అజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెప్పక్కర్లేదు. తెలుగు సినిమాల్లో నటుడిగా, విలన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అటు భయంకరమైన విలన్ గా నటిస్తూనే.. ఇటు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అయితే మాస్ మహరాజా రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా తన జీవితాన్ని మార్చేసిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. విక్రమార్కుడు సినిమా భారీ విజయం సాధించిన తర్వాత తనకు మరిన్ని అవకాశాలు వచ్చాయని అన్నారు. ఆ మూవీ విడుదలైన తర్వాత తనకు నాలుగైదేళ్లు భారీగానే పారితోషికాలు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..

బయటి ఉద్యోగాలతో పోలిస్తే సినీరంగంలో విజయం సాధిస్తే రాత్రికి రాత్రే భారీగా సంపాదించవచ్చని తాను భావించానని అన్నారు. సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే సహనం, ఓపిక అవసరమని అన్నారు. మొదటి పదేళ్లు ఎలాంటి ఫలితాలు కనిపించకపోవచ్చని.. కానీ విజయం సాధించే శాతం చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. బయట ఉన్నవాళ్లకు కోట్ల పారితోషికాలు ఎక్కువగా అనిపించినా.. సినిమా కోసం పడే కష్టాలు, పోరాటాలు, సహనం, ఎదురుచూపులు, అలాగే విఫలమైతే ఎదురయ్యే పరిస్థితులు వారికి కనిపించవని అజయ్ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..

తన కెరీర్ మలుపు తిప్పిన సినిమా విక్రమార్కుడు అని.. ఆ మూవీ తనకు పేరు తెచ్చిపెట్టిందని అన్నారు. ఆ సినిమా తర్వాత తనకు దాదాపు పది నుంచి ఇరవై వరకు అవకాశాలు వచ్చాయని అన్నారు. లక్ష్మీ కళ్యాణం, ఆర్య 2, ఇష్క్, బృందావనం సినిమాలలోని పాత్రలు తనకు ఇష్టమని వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..