హీరో నుంచి విలన్‏గా మారిన మరో కుర్ర నటుడు.. సిక్స్ ప్యాక్ లుక్‏తో అదరగొట్టిన అభినవ్..

హీరో నుంచి విలన్‏గా మారిన మరో కుర్ర నటుడు.. సిక్స్ ప్యాక్ లుక్‏తో అదరగొట్టిన అభినవ్..
Abhinav

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కుర్రహీరోలు కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ప్రయత్నింటారు. స్టార్ హీరోస్ సైతం

Rajitha Chanti

|

Jan 03, 2022 | 8:00 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కుర్రహీరోలు కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ప్రయత్నింటారు. స్టార్ హీరోస్ సైతం నెగిటివ్ పాత్రలు చేయడానికి నో చెప్పడం లేదు. ఈ క్రమంలో విలన్ రోల్స్ కు కూడా సై అంటూ బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు ఈ కుర్రహీరో కూడా విలన్ గా భయపెడతానంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వైవిధ్యమైన కథా, కథనాలకు తోడు విభిన్నమైన మార్కెటింగ్ స్ట్రాటజీతో దూసుకుపోతున్నారు.

ఇటీవల తమ సినిమా నుంచి రెండు పాటలు విడుదల చేసి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న మిస్టేక్ మూవీ టీమ్ తాజాగా సినిమాలోని విలన్ క్యారెక్టర్ ను పరిచయం చేసింది. ‘రామ్ అసుర్’ సినిమాలో హీరోగా అలరించిన అభినవ్ సర్దార్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నారు. మొదటి సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ లో చెలరేగిపోయిన అభినవ్ ఇప్పుడు విలన్ గెటప్ లో భయపెట్టడానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలో మిస్టెక్ మూవీ నుంచి అభినవ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అభినవ్ తనని తాను సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారనే విషయం ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. సిక్స్ ప్యాక్స్, లాంగ్ హెయిర్ స్టైల్ తో కనిపిస్తోన్న అభినవ్ టాలీవుడ్ విలనిజంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభినవ్ విలన్ లుక్ ను హీరో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. సన్నీ కోమలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని రెండు పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక అభినవ్ సర్దార్ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రంలో అజయ్ కతుర్వార్, తేజా అయినంపూడి, సుజిత్ కుమార్, కరిష్మా కుమార్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని చిత్రబృందం అనౌన్స్ చేయనుంది.

Also Read: Kajal Aggarwal: తొలిసారి బేబి బంప్‏తో కనిపించిన కాజల్.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu