Abhinav Gomatam: హీరోగా మారనున్న ప్రముఖ నటుడు.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.

మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు వంటి సినిమాలతో మంచి నటుడిగా

Abhinav Gomatam: హీరోగా మారనున్న ప్రముఖ నటుడు.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.
Abhinav Gomatam

Updated on: Jan 01, 2022 | 1:44 PM

మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అభినవ్ గోమఠం. ఇటీవల శ్యామ్ సింగ రాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో నిర్మించనున్న ఈ సినిమాను నూతన దర్శకుడు తెరకెక్కించబోతున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న మూవీకి నుంచి తాజాగా అభినవ్ గోమఠం పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఈరోజు (జనవరి 1న) అభినవ్ గోమఠం పుట్టిన రోజు సందర్భంగా సినిమా గురించి ప్రకటించినట్లు తెలిపారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది చిత్రయూనిట్.

తెలంగాణ ప్రాంతానికి చెందిన అభినవ్ గోమఠం నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2014లో వచ్చిన మైనే ప్యార్ కియా సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన అభినవ్.. 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాలోని కౌశిక్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు. రంగ్ దే, మీకు మాత్రమే చెప్తా, ఫలక్ నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది, మళ్లీరావా, ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలలో నటించి మెప్పించాడు అభినవ్ గోమఠం.

Also Read: Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..

Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..