Abbas: ఎంతోమంది మనసులు కొల్లగొట్టిన లవర్‏బాయ్ అబ్బాస్.. కెరీర్‏లో ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా.. 

సినీ పరిశ్రమలో ఒకప్పుడు లవర్‍బాయ్స్‏గా స్టార్ హీరోస్‏గా గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మందే ఉన్నారు. యూత్‎లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని.. హ్యాండ్సమ్ లుక్‏తో

Abbas: ఎంతోమంది మనసులు కొల్లగొట్టిన లవర్‏బాయ్ అబ్బాస్.. కెరీర్‏లో ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా.. 
Abbas

Updated on: Feb 07, 2022 | 4:08 PM

సినీ పరిశ్రమలో ఒకప్పుడు లవర్‍బాయ్స్‏గా స్టార్ హీరోస్‏గా గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మందే ఉన్నారు. యూత్‎లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని.. హ్యాండ్సమ్ లుక్‏తో అమ్మాయిలలో ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరోస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరుణ్, ఉదయ్ కిరణ్, వడ్డే నవీన్, అబ్బాస్, అజిత్, అరవింద్ స్వామి.. ఇలా చాలా మంది స్టార్స్ అప్పట్లో స్టార్ డమ్ అందుకున్నారు. ముఖ్యంగా వీరిలో తెలుగుతోపాటు.. తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నవారిలో.. అజిత్, అబ్బాస్ (Abbas), అరవింద్ స్వామి ముగ్గురు టాప్. ప్రస్తుతం ఈ ముగ్గురిలో అజిత్ (Ajith) స్టార్ హీరోగా రాణిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్ పాత్రలలో అదరగొడుతున్నాడు. కానీ అబ్బాస్ మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే అమ్మాయిల మనసు కొల్లగొట్టిన అబ్బాస్ సినిమాల నుంచి దూరమైన తర్వాత అనేక కష్టాలు పడ్డాడట.

1996లో ప్రేమ దేశం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు అబ్బాస్. మొదటి సినిమాతోనే యూత్‏లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అప్పట్లో అబ్బాస్ హెయిర్ స్టైల్ తెగ ఫాలో అయ్యేవారు.. ఇప్పటికీ అబ్బాస్ హెయిర్ స్టైల్ అంటూ వినిపిస్తుంటుంది. ఈ సినిమాతో తెలుగులో అబ్బాస్‏కు వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. అంతేకాకుండా.. అబ్బాస్ ప్రధాన పాత్రలో నటించిన ప్రియా ఓ ప్రియా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగు చిత్రపరిశ్రమలో అబ్బాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే కొంతకాలం తర్వాత అబ్బాస్ వరుస పరాజయాలను చవి చూశాడు. ఆయన నటించిన రాజహంస, శ్వేతనాగు సినిమాలు ఆశించనంత హిట్ కాలేదు. దీంతో అబ్బాస్ పూర్తిగా తమిళ్, మలయాళ సినిమాలవైపు వెళ్లాడు. అక్కడ కూడా అబ్బాస్ నటించిన చిత్రాలు అంతగా హిట్ కాలేదు. దీంతో ఆయన సినిమాలకు దూరంగా న్యూజిలాండ్ వెళ్లాడు. అక్కడ కొంత కాలం పెట్రోల్ బంకులో పని చేసి.. బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పనులకు వెళ్లాడు. ఇక అక్కడ పనిచేసిన అనుభవంతో ప్రస్తుతం అదే రంగంలో కొనసాగుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అబ్బాస్.. తన జీవితంలో ఎదుర్కోన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.

Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..

Lata Mangeshkar: అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమ వాళ్లది.. లతా మంగేష్కర్ ప్రేమ ద్వేషంగా ఎందుకు మారిందో తెలుసా..

Pawan Kalyan-Statue of Equality: సమతామూర్తి భగవద్ రామానుజాచార్య సన్నిధిలో ‘పవన్ కళ్యాణ్’.. చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న ‘జనసేనని’ ఫొటోస్..

Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)