Lathi Movie Teaser: ఫుల్ పవర్ ప్యాక్డ్ .. ఆకట్టుకుంటోన్న విశాల్ ‘లాఠీ’ టీజర్..

|

Jul 25, 2022 | 9:42 AM

యాక్షన్ హీరో విశాల్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాతో దూసుకుపోతున్నారు.. తాజాగా విశాల్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

Lathi Movie Teaser: ఫుల్ పవర్ ప్యాక్డ్ .. ఆకట్టుకుంటోన్న విశాల్ లాఠీ టీజర్..
Lathi
Follow us on

యాక్షన్ హీరో విశాల్(Vishal) హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాతో దూసుకుపోతున్నారు.. తాజాగా విశాల్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. విశాల్ కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా లాఠీ(Lathi)అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు విశాల్.  హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ మూవీనుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

లాఠీ మూవీ ‘టీజర్’ ఫుల్ పవర్ ప్యాక్డ్ గా కట్ చేశారు.  “రేయ్… తప్పు చేసి తలదాచుకునే పోకిరివి… నీకే ఇంత పొగరున్నప్పుడు… ఆ తప్పుని నిలదీసే పోలీసోడ్ని… నాకు ఎంత పొగరుంటుంది”అంటూ విశాల్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో  నిజాయితీగా పని చేసే పోలీస్ గా కనిపించారు విశాల్ . అలాగే విలన్స్వి తో విశాల్ధి ఫైట్ని కు సంబంధించిన సీన్స్ ను చూపించారు.  మొత్తంగా ఈ సినిమా కంప్లీట్ద యాక్షన్ర్శ ఎంటర్టైనర్ గా రానుందని అర్ధమవుతోంది.  వినోద్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పీటర్ హెయిన్ డిజైన్ చేసిన స్టంట్స్ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. అలాగే సెకండ్ ఆఫ్ లో వచ్చే 45నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకి హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్‌ పెట్టారు. సెప్టెంబర్ 15న ‘లాఠీ’ అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.