ప్రముఖ నటి రోజా ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. అయినా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారామె. ఇదిలా ఉంటే రోజా బాటలోనే ఆమె కూతురు అన్షు మాలిక కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన అందంతో ఇప్పటికే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓప్రముఖ బ్యానర్‌తో అన్షు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే అన్షు మాలిక సినీ రంగ ప్రవేశంపై ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయం పక్కన పెడితే సినిమాల్లోకి రాకుండానే అవార్డుల మీద అవార్డులు గెల్చుకుంటోంది అన్షు. వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా మంచి పేరు సంపాదిస్తోంది రోజా కూతురు. అంతేకాదు రైటర్‌గా కూడా సత్తా చాటుతోంది. తన మల్టీ ట్యాలెంటెతో ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటోంది. అలా తాజాగా అన్షు ఓ అరుదైన అవార్డును సొంతం చేసుకుంది.
నైజీరియాలోని లాగోస్‌లో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్‌లో “సోషల్ ఇంపాక్ట్” విభాగంలో గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డు అందుకుంది అన్షు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమెనే షేర్ చేసింది. అవార్డుతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన వారందరూ ‘వావ్’ అంటూ రోజా కూతురిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా అన్షు గతలో ‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్’ అనే నవల కూడా రాసింది. దీనికి గానూ ‘ బెస్ట్ ఆథర్ ఇన్ సౌత్ ఇండియా’ అవార్డును కూడా అందుకుందీ స్టార్ కిడ్.
20 ఏళ్లకే విభిన్న రంగాల్లో సత్తా చాటుతోంది రోజా కూతురు అన్షు. మరి ఆమె సినిమాల్లోకి ఎప్పుడు వస్తుందో? చూడాలి మరి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.