Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో ట్విస్ట్.. నిందితుడి అరెస్ట్..

సైఫ్‌ అలీఖాన్‌ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిని ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడిని బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను టార్గెట్‌గా చేసుకుని విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌పై జరిగిన దాడి ప్రభుత్వ వైఫల్యమని అంటున్నాయి.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో ట్విస్ట్.. నిందితుడి అరెస్ట్..
Saif Ali Khan

Updated on: Jan 17, 2025 | 1:18 PM

సైఫ్‌ అలీఖాన్‌ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిని ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడిని బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను టార్గెట్‌గా చేసుకుని విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌పై జరిగిన దాడి ప్రభుత్వ వైఫల్యమని అంటున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు. సినీ కళాకారుల భద్రతపై ప్రభుత్వం భరోసా ఇవ్వాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి కోసం నిన్నటి నుంచి ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. సైఫ్‌పై దాడికి పాల్పడిన తర్వాత దుండగుడు తొలుత ముంబై లోకల్‌ ట్రెయిన్‌లో వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు.

జనవరి 16న అర్దరాత్రి నిందితుడు సైఫ్, కరీనా కపూర్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లిన అతడిని కేర్ టేకర్ అడ్డుకుంది. ఆ సమయంలో ఆమె పై దాడి చేస్తున్న సమయంలోనే మరో గదిలో ఉన్న సైఫ్ బయటకు వచ్చి నిందితుడిని అడ్డుకోబోయాడు. ఈ క్రమంలోనే నిందితుడు సైఫ్ పై కత్తితో దాడి చేయడంతో అతడి శరీరంపై ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహీం అలీఖాన్ తన తండ్రిని ఆటోలో లీలావతి ఆసుపత్రికి తరలించాడు. నిన్న సైఫ్‌కి వెన్నెముక ఆపరేషన్‌ చేసి రెండు అంగుళాల కత్తి ముక్కను తీశారు డాక్టర్లు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఈ కేసుపై విచారణ ప్రారంభించిన పోలీసులు… సైఫ్ ఇంటితోపాటు చుట్టు పక్క ఇళ్లల్లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..