Jani Master: ‘కొంత మంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్‌గా బిహేవ్ చేస్తున్నారు’.. లేడీ కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు

|

Sep 19, 2024 | 2:25 PM

జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారు. అలాగే ఇప్పటివరకు ఈ సంచలన ఆరోపణలపై జానీ మాస్టర్ స్పందించలేదు. కాబట్టి చాలా మంది జానీ మాస్టర్ దే తప్పని సూచిస్తున్నాయి. అదే సమయంలో ఆరోపణలు ప్రూవ్ అవ్వకుండా ఒక వ్యక్తిని నిందించడం తగదని మరికొందరు అంటున్నారు.

Jani Master: కొంత మంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్‌గా బిహేవ్ చేస్తున్నారు.. లేడీ కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు
Jani Master, Jyothi Raj
Follow us on

గత రెండు రోజులుగా జానీ మాస్టర్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసే ఒక లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు మతం మార్చుకోమ్మని, పెళ్లి చేసుకొమ్మని బలవంతపెట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదును పరిగణణలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారు. అలాగే ఇప్పటివరకు ఈ సంచలన ఆరోపణలపై జానీ మాస్టర్ స్పందించలేదు. కాబట్టి చాలా మంది జానీ మాస్టర్ దే తప్పని సూచిస్తున్నాయి. అదే సమయంలో ఆరోపణలు ప్రూవ్ అవ్వకుండా ఒక వ్యక్తిని నిందించడం తగదని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ ఆట సందీప్ సతీమణి, ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్ జానీ మాస్టర్ కేసుపై సంచలన కామెంట్స్ చేసింది. జానీ మాస్టర్ పేరు డైరెక్టుగా చెప్పకుండా ఈ కేసుకు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేసింది. అందులో ఆమె చెప్పిందంటే..

‘ఈ రోజుల్లో చాలా మందో ఓవర్ స్మార్ట్ అవుతున్నారు. చాలామంది అమ్మాయిల గురించి చెప్పడానికే నేను ఈ వీడియో చేశాను. అబ్బాయిలు ఎవరైనా ఆడపిల్లల్ని ఏడిపిస్తే, వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే కచ్చితంగా శిక్షించాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంత పెద్దవాళ్లను అయినా వాళ్లను వదలకూడదు. కానీ కొన్ని చట్టాలని ఉపయోగించుకొని కొంతమంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ గా ప్రవర్తిస్తున్నారు. లైఫ్ లో బాగా కష్టపడి ఎదిగిన అబ్బాయిల కెరీర్ ని దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు. వాళ్లను కూడా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మనం రెండు వైపులా విని మాట్లాడాలి. కానీ ఫేమస్ వ్యక్తి కదా అని తన పొజిషన్ ని మన వ్యూస్ కోసం, ఇంటర్వూస్ కోసం వాడొద్దు. తప్పు చేస్తే కచ్చితంగా ఎవరికైనా శిక్ష పడాల్సిందే. కచ్చితంగా నిజం బయటకి వస్తుంది’ అని చెప్పుకొచ్చింది జ్యోతిరాజ్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జ్యోతి రాజ్ రిలీజ్ చేసిన వీడియో…

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.