AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aarthi Agarwal: 16 ఏళ్లకే తొలి సినిమాతో స్టార్‏డమ్.. ఆ చిన్న పొరపాటుతో ప్రాణాలు వదిలిన ఆర్తి అగర్వాల్..

మొదటి సినిమాతోనే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‏తో జతకట్టిన ఆర్తి... ఆ తర్వాత ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ వంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ముఖ్యంగా ఇంద్ర సినిమాలో చిరంజీవికి ప్రేయసిగానే కాదు.. ఎదురించే ప్రతినాయికగానూ ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. చిన్న వయసులోనే స్టార్ డమ్ అందుకుని.. టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయింది.

Aarthi Agarwal: 16 ఏళ్లకే తొలి సినిమాతో స్టార్‏డమ్.. ఆ చిన్న పొరపాటుతో ప్రాణాలు వదిలిన ఆర్తి అగర్వాల్..
Aarthi Agarwal
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 18, 2023 | 6:53 PM

Share

చంద్రబింబం లాంటి ముఖం.. కలువల్లాంటి కన్నులు.. నిండైన రూపం.. చూడగానే కట్టిపడేసే అందం.. అన్ని ఆర్తి అగర్వాల్ సొంతమే. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని రూపం. ‘నువ్వు నాకు నచ్చావ్’ అంటూ 16 ఏళ్ల వయసులో టాలీవుడ్ వెండితెరపై సందడి చేసింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇంకేముంది.. ఆమె ముందు వరుస అవకాశాలు క్యూకట్టాయి. మొదటి సినిమాతోనే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‏తో జతకట్టిన ఆర్తి… ఆ తర్వాత ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ వంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ముఖ్యంగా ఇంద్ర సినిమాలో చిరంజీవికి ప్రేయసిగానే కాదు.. ఎదురించే ప్రతినాయికగానూ ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. చిన్న వయసులోనే స్టార్ డమ్ అందుకుని.. టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన ఆర్తి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయింది.

నిండైన రూపం.. చక్కని చిరునవ్వుతో కోట్లాది ప్రేక్షకులను అలరించిన ఆర్తి నిజ జీవితంలో మాత్రం ఎంతో విషాదం దాగుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ప్రేమ, పెళ్లంటూ వచ్చిన రూమర్స్‏తో విసిగి 2005లో క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏడాది.. మెట్లపై నుంచి పడి ఆసుపత్రిలో చేరింది. ఇక ప్రేమే కాదు.. పెళ్లి సైతం ఆమె జీవితంలో ఎక్కువ రోజులు కొనసాగలేదు. 2007లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ ను పెళ్లి చేసుకున్నారు ఆర్తి. ఆ తర్వాత కొంత కాలంగా వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు.

అయితే చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆర్తి అగర్వాల్ రీఎంట్రీ సైతం పెద్ద సక్సెస్ కాలేదు. పలు చిత్రాల్లో కీలకపాత్రలలో కనిపించినప్పటికీ అంతగా హిట్ కాకపోవడంతో.. ఆర్తికి అవకాశాలు రాలేదు. తెలుగులో మొత్తం 50కి పైగా చిత్రాల్లో నటించింది ఆర్తి అగర్వాల్. అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆర్తి.. బరువు తగ్గేందుకు తీసుకున్న నిర్ణయమే ఆమె ప్రాణాలను తీసింది. స్థూలకాయం, శ్వాసకోస సమస్యలతో బాధపడిన ఆమె.. 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ఫెక్షన్ రావడంతో జూన్ 6న ఆర్తి అగర్వాల్ కన్నుమూసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మారుతున్న ట్రెండ్.. డిజిటల్ వైపు అడుగులేస్తున్న టాలీవుడ్ హీరోలు
మారుతున్న ట్రెండ్.. డిజిటల్ వైపు అడుగులేస్తున్న టాలీవుడ్ హీరోలు
Video: టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే మరో బెస్ట్ క్యాచ్..
Video: టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే మరో బెస్ట్ క్యాచ్..
మీ ఇంట్లో ఏనుగు బొమ్మ ఉందా..? ఇలా చేస్తే మీకు రెట్టింపు అదృష్టం.!
మీ ఇంట్లో ఏనుగు బొమ్మ ఉందా..? ఇలా చేస్తే మీకు రెట్టింపు అదృష్టం.!
సింగరేణి గడ్డపై కాంగ్రెస్ హవా.. రామగుండం కార్పొరేషన్‌లో ఘన విజయం
సింగరేణి గడ్డపై కాంగ్రెస్ హవా.. రామగుండం కార్పొరేషన్‌లో ఘన విజయం
స్కూల్ కైనా ఆఫీస్ కైనా ఈ రైస్ పంపిస్తే బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే
స్కూల్ కైనా ఆఫీస్ కైనా ఈ రైస్ పంపిస్తే బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే
శ్రీకాళహస్తిలోనూ గిరి ప్రదక్షిణ.. భక్తులకు పవన్ కళ్యాణ్ తీపికబురు
శ్రీకాళహస్తిలోనూ గిరి ప్రదక్షిణ.. భక్తులకు పవన్ కళ్యాణ్ తీపికబురు
ఐఫోన్ ధరకే లగ్జరీ కార్లు.. అద్దిరిపోయే ఫీచర్లు.. ఎక్కడో కాదు..
ఐఫోన్ ధరకే లగ్జరీ కార్లు.. అద్దిరిపోయే ఫీచర్లు.. ఎక్కడో కాదు..
ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన 'బ్లెస్సింగ్'.. కట్‌చేస్తే..
ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన 'బ్లెస్సింగ్'.. కట్‌చేస్తే..
మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..?
మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..?
పెయింట్ పాడవకుండా క్రేయాన్స్, మార్కర్ మరకలు మాయం
పెయింట్ పాడవకుండా క్రేయాన్స్, మార్కర్ మరకలు మాయం