Arjit Singh : నువ్వు పాడడం ఆపేస్తే మేమేమైపోతాము.. అర్జిత్ సింగ్ కు స్టార్ హీరో రిక్వెస్ట్..

బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన పాటలతో శ్రోతల హృదయాలు గెలుచుకున్నారు. నిజానికి అర్జిత్ పాటలకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కానీ ఇటీవల అతడు తీసుకున్న నిర్ణయంతో అభిమానులు షాకయ్యారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జిత్ సింగ్ ను స్వయంగా కలిసి పాటలు పాడాలంటూ రిక్వెస్ట్ చేశారు.

Arjit Singh : నువ్వు పాడడం ఆపేస్తే మేమేమైపోతాము.. అర్జిత్ సింగ్ కు స్టార్ హీరో రిక్వెస్ట్..
Arijit Singh

Updated on: Feb 24, 2026 | 8:13 AM

బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ క్రేజ్ గురించి తెలిసిందే. హిందీలో ఎన్నో అద్భుతమైన పాటలతో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా అర్జిత్ పాడిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకున్నాయి. ఇటీవలే అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై తాను హిందీ సినిమాల్లో పాటలు పాడడం లేదని స్పష్టం చేశారు. అలాగే కొత్త సినిమాలు అంగీకరించనని వెల్లడించారు. ఈ క్రమంలోనే అతడిని స్వయంగా కలిసి తన ఆలోచన మార్చుకోవాలని రిక్వెస్ట్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్. తన కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన లేటేస్ట్ చిత్రం ఏక్ దిన్. ఈ మూవీ టైటిల్ ట్రాక్ రికార్డ్ చేయడానికి అమిర్.. ముర్షిదాబాద్ లోని అర్జిత్ ఇంటికి వెళ్లి అతడిని కలిశారు. ప్రస్తుతం ఇందుకు సంంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

ప్లేబ్యాక్ సింగింగ్ నుంచి రిటైర్ కావద్దంటూ ఆ వీడియోలో అమిర్ కోరడం విపిస్తుంది. కొత్తగా ఏ ప్రాజెక్టు చేయడం లేదా ? అర్జిత్.. ఎందుకు కొంతకాలం విరామం ఏమైనా తీసుకోవాలని అనుకుంటున్నావా..? లేదంటే అసలు హిందీ సినిమాలే చేయకూడదనుకుంటున్నావా.. ? అని అడిగారు అమిర్ ఖాన్. అనంతరం ఆయనే మాట్లాడుతూ.. ఇలా చేయొద్దు అర్జిత్.. నువ్వు పాడడం ఆపేస్తే మేమంతా ఏమైపోతాం అని అన్నారు. దీంతో అర్జిత్ ఆయనకు పాదాభివందనం చేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి గాలి పటాలు ఎగురవేశారు. కాసేపు చెస్ ఆడారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బైక్ పై వీధుల్లో తిరిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

అయితే అమీర్ ఖాన్ స్వయంగా అర్జిత్ ఇంటికి వెళ్లి.. అతడు పాటలు పాడడం ఆపేయొద్దంటూ కోరినందుకు నెటిజన్స్ హీరోకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అర్జిత్ సింగ్ పాటలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే అర్జిత్ రిటైర్మెంట్ ప్రకటించడంపై ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తన రిటైర్‌మెంట్‌కు గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

 

 

Follow Us