Laal Singh Chaddha: మెగాస్టార్ చిరంజీవి కోసం ‘లాల్ సింగ్ చద్దా’ ‘మెగా’ ప్రివ్యూ.. హైదరాబాద్‏లో అమీర్ ఖాన్..

|

Jul 14, 2022 | 5:21 PM

ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని వార‌సుడు నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన

Laal Singh Chaddha: మెగాస్టార్ చిరంజీవి కోసం ‘లాల్ సింగ్ చద్దా’ ‘మెగా’ ప్రివ్యూ.. హైదరాబాద్‏లో అమీర్ ఖాన్..
Laal Singh Chaddha
Follow us on

ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి మ‌ధ్య‌ స్నేహం చాలా ఏళ్ల‌నాటిది. వారిద్ద‌రిది ప‌ర‌స్ప‌ర గౌర‌వ‌పూర్వ‌క‌మైనబంధం. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha). ఇటీవలి కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ చిత్రాలలో ఒకటి. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని వార‌సుడు నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమ‌యింది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ షురు చేసింది చిత్రయూనిట్. తాజాగా తన చిరకాల మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి కోసం లాల్ సింగ్ చద్దా ప్రివ్యూ నిర్వహించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అతిథుల కోసం తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన లాల్ సింగ్ చద్దా ప్రత్యేక ప్రివ్యూను హైదారాబాద్ లో నిర్వహించారు.

ఈ వారం మొద‌ట్లో హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ జరిగింది. ఈ ప్రివ్యూకి ప్రత్యేక అతిధులుగా కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, స్టార్ డైరెక్టర్లు ఎస్ఎస్.రాజమౌళి, సుకుమార్ గార్లు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

Megastar

లాల్ సింగ్ చద్దా ప్రత్యేక ప్రివ్యూకి మెగాస్టార్ తో పాటు హాజరైన అతిథులంతా ఈ సినిమా ప‌ట్ల ఎంతో సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఈ ప్రివ్యూకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. హాలీవుడ్ లో విజయవంతమైన ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కించారు.. ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు.