వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్న యంగ్ హీరో.. కొత్త సినిమాను లైన్ లో పెట్టిన ఆది సాయికుమార్..

|

Apr 20, 2021 | 6:59 AM

ప్రేమ‌కావాలి, ల‌వ్‌లీ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల హీరో ఆది సాయికుమార్‌, అహ‌ నా పెళ్ళంట‌!‌, పూలరంగడు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్రం.

వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్న యంగ్ హీరో.. కొత్త సినిమాను లైన్ లో పెట్టిన ఆది సాయికుమార్..
Follow us on

Aadi sai kumar: ప్రేమ‌కావాలి, ల‌వ్‌లీ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల హీరో ఆది సాయికుమార్‌, అహ‌ నా పెళ్ళంట‌!‌, పూలరంగడు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్రం. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `చుట్టాలబ్బాయి` సూప‌ర్‌హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్ రీపీట్ అవుతోంది. ఆది సాయికుమార్ హీరోగా, ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ ప‌తాకాల‌పై నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాత‌లుగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అన్ని వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ..
ద‌ర్శ‌కుడు ఎం. వీర‌భ‌ద్రం మాట్లాడుతూ – “ ఆది సాయికుమార్ హీరోగా నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `చుట్టాల‌బ్బాయి` మంచి హిట్ అయింది. ప్ర‌స్తుతం మ‌రోసారి మా కాంబినేష‌న్‌లో అధ్భుత‌మైన విజ‌యాన్ని సాధించే సినిమా చేయాల‌ని ప్లాన్ చేశాం. స‌బ్జెక్ట్ చాలా

బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా మ‌రో మంచి హిట్ సినిమా అవుతుంది. నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు మంచి అభిరుచి ఉన్న నిర్మాత‌లు. ఒక సూప‌ర్‌హిట్ సినిమా చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. వారి నిర్మాణంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఒక భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువ‌స్తాం“ అన్నారు .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sameera Reddy: నాతో పాటు నా పిల్లలకు కూడా కరోనా బారిన పడ్డారు.. జాగ్రత్తగా ఉండమంటూ ఎమోషనల్ పోస్ట్

Sumitra Bhave: చిత్రపరిశ్రమలో మరో విషాదం… లెజండరీ డైరెక్టర్ సుమిత్ర భావే మృతి..

స్జేజ్ పై డ్యాన్స్ చేస్తూ కింద పడ్డ ప్రముఖ సింగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..