Allu Arjun : గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని హీరోల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు పరశురామ్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన గీతగోవిందం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను పరశురామ్ నడిపించిన తీరు అందరిని అలరించింది. పరశురామ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. సర్కారు వారి పాట అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు మరింత స్టైలిష్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తిసురేష్ నటిస్తుంది. ఈ మూవీ బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దుబాయ్, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు చిత్రయూనిట్ గోవాలో హీరో హీరోయిన్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక ఈ సినిమాతర్వాత పరశురామ్ అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో సినిమా చేయనున్నాడు. నిజానికి మహేష్ కంటే ముందే చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ ఆఫర్ రావడంతో పరశురామ్ మహేష్ సినిమాను మొదలుపెట్టాడు. ఇక ఇప్పుడు మహేష్ సినిమా అయిపోయిన వెంటనే చైతన్యతో సినిమా చేయనున్నాడు. చైతూ సినిమా పూర్తయిన వెంటనే మరో స్టార్ హీరోతో సినిమా చేయనుండట పరశురామ్. అయితే ‘గీత గోవిందం’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన దగ్గర నుంచి గీతా ఆర్ట్స్‌తో పరశురామ్‌కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దాంతో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నారట. బన్నీతో ఒక సినిమా చేసే దిశగా పనులను పరశురామ్ లైన్లో పెడుతున్నాడని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :