
ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడింది. చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో కానత్తూర్ సమీపంలో పోలీసులు వాహనతనిఖీలు చేస్తుండగా..రమ్యకృష్ణకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా కారు( TN07Q 0099) అటుగా వచ్చింది. దీంతో ఆమె వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. అందులో 96 బీర్ బాటిల్స్, 8 లిక్కర్ సీసాలు గుర్తించారు. దీంతో వెంటనే ఆమె వాహన డ్రైవర్ సెల్వకుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే రమ్య కృష్ణ వచ్చి అతడిని బెయిల్ పై తీసుకుని వెళ్లినట్టు సమాచారం.