సినిమా అనేది ఓ రంగుల ప్రపంచమే కాదు.. మనం చూడాలే కానీ సినిమాలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు.. ఎన్నో అద్భుతమైన విషయాలను నేర్పడమే కాకుండా కొన్ని సలహాలను, కొంతమందికి స్ఫూర్తిని ఇస్తుంటాయి సినిమాలు. నటీనటులు అద్భుతమైన తమ ప్రతిభతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. అలరిస్తూ ఉంటారు. సినిమా అనేది వినోదాన్ని మాత్రమే కాదు విజ్ఞానాని కూడా అందిస్తుందని చాలా సినిమాలు నిరూపించాయి.ఇక ప్రతిభకు పట్టం కట్టే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా 68 వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.
ఈరోజు ఢిల్లీలో 68 వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్ చెందిన పలువురు ప్రముఖులు ఈ వేదికలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందించారు. నేషనల్ అవార్డ్స్ అందుకున్న వారిలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు జాతీయ అవార్డు దక్కింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు గాను సంగీత దర్శకుడు తమన్ అవార్డు గెలుచుకున్న విషయం గతంలోనే ప్రకటించారు. తాజాగా ఆయన అవార్డు అందుకుంటున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. . అలాగే ‘కలర్ ఫోటో’ సినిమాకు కూడా నేషనల్ అవార్డు దక్కింది.
కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తోపాటు ఈ సినిమా నిర్మాత సాయి రాజేష్ అవార్డులను తీసుకున్నారు. అలాగే తెలుగు సినిమా బెస్ట్ కొరియోగ్రఫీ విభాగంలో ‘నాట్యం’ సినిమా అవార్డుకు ఏమికా అయ్యింది. ఇందుకుగాను సంధ్య రాజు అవార్డు అందుకున్నారు. వీరితో పాటు తమిళ్ హీరో సూర్య, జ్యోతిక కూడా అవార్డులను అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.