Megastar Chiranjeevi: మెగాస్టార్‏కు మరో అరుదైన గౌరవం.. అత్యంత ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు..

|

Nov 20, 2022 | 7:59 PM

తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే అత్యంత ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు లభించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా...

Megastar Chiranjeevi: మెగాస్టార్‏కు మరో అరుదైన గౌరవం.. అత్యంత ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు..
Megastar Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా వేలాది అభిమానులను సొంతం చేసుకున్న చిరుకు.. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే అత్యంత ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు లభించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా… ఇండియన్ ఫిల్మ్ పర్సనాలీటి ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుతో చిరును సత్కరించనుంది భారత ప్రభుత్వం. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన.. ప్రభావవంతమైన నటులలో ఒకరిగా గుర్తింపు లభించింది.

చిరంజీవి 1978లో విడుదలైన ‘పునాదిరాళ్లు’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. తరువాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ అయ్యారు. చిరు నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ క్రియేట్ చేశాయి. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 10 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 4 నంది అవార్డులతో సహా అనేక అవార్డులు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఖైదీ నంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవల గాడ్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు.. ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.