
1996 సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక ప్రత్యేకమైన కాలాన్ని సూచిస్తుంది. ఆ ఏడాది అనేక రకాల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రాల జాబితాను పరిశీలించడం ద్వారా, వాటి బాక్సాఫీస్ ప్రదర్శనల ఆధారంగా ఆనాటి సినిమా ట్రెండ్‌లు, ప్రేక్షకుల అభిరుచులు, సక్సెస్ ఫార్ములాలను డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తం 95 చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ చిత్రాలను వాటి బాక్సాఫీస్ పనితీరు ఆధారంగా డివైడ్ చేద్దాం.
ఇండస్ట్రీ హిట్: 1996లో కేవలం ఒక చిత్రం మాత్రమే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ నాగార్జున, టబు జంటగా నటించిన “నిన్నే పెళ్ళాడతా”. ఈ చిత్రం 1996లో అగ్రస్థానంలో నిలిచి, సినీ చరిత్రలో ఒక మైలురాయిగా మారింది. కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
బ్లాక్ బస్టర్: ఐదు చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలుగా నమోదయ్యాయి. వీటిలో “పెళ్ళి సందడి”, “పోలీస్ స్టోరీ”, “ప్రేమ దేశం”, “భారతీయుడు”, “ముత్తు” ఉన్నాయి. ఈ చిత్రాలు భారీ కమర్షియల్ విజయాలను సాధించి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సూపర్ హిట్: పద్నాలుగు చిత్రాలు సూపర్ హిట్‌లుగా నిలిచాయి. “ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు”, “దళం”, “ధర్మచక్రం”, “నాయుడు గారి కుటుంబం”, “పవిత్రబంధం”, “పిట్టల దొర”, “బొంబాయి ప్రియుడు”, “మావిచిగురు”, “వంశానికొక్కడు”, “వినోదం”, “సోగ్గాడి పెళ్ళాం”, “ప్రేమలేఖ”, “ప్రేమించి పెళ్ళాడుతా”, “భామనే సత్యభామనే” వంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాయి.
హిట్: 1996లో తొమ్మిది చిత్రాలు హిట్‌లుగా నిలిచాయి. “నల్ల పూసలు”, “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి”, “ఊహ”, “కూతురు”, “మా ఆవిడ కలెక్టర్”, “మృగం”, “ఎర్రకోట”, “బాల రామాయణం”, “సాహసవీరుడు సాగరకన్య” ఈ లిస్ట్‌లోకి వస్తాయి. ఈ మూవీస్.. ప్రేక్షకులను మెప్పించి.. నిర్మాలతలకు లాభాలు తెచ్చాయి.
యావరేజ్: ఆ ఏడాది 24 చిత్రాలు సగటు ఫలితాలను సాధించాయి. వీటిలో “అక్క బాగున్నావా?”, “అక్కుం బక్కుం”, “అమ్మ నాగమ్మ”, “అరణ్యం”, “జగదేకవీరుడు”, “జాబిలమ్మ పెళ్లి”, “దెయ్యం”, “పుట్టింటి గౌరవం”, “పెళ్ళాల రాజ్యం”, “ప్రేమ ప్రయాణం”, “బొబ్బిలి బుల్లోడు”, “రాముడొచ్చాడు”, “రాయుడు గారు నాయుడు గారు”, “రెండు కుటుంబాల కథ”, “లాఠీ ఛార్జ్”, “లిటిల్ సోల్జర్స్”, “హలో గురూ..!”, “ఆర్మీ కమాండర్”, “ఆశ ఆశ ఆశ”, “ఎమర్జెన్సీ”, “కాలాపాని”, “కోనసీమ మొనగాడు”, “డేరింగ్ హీరో”, “మిస్టర్ రోమియో” ఉన్నాయి. ఈ చిత్రాలు నష్టాలను నివారించి, ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాయి.
ఫ్లాప్: దురదృష్టవశాత్తు 42 చిత్రాలు 1996లో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నమోదయ్యాయి. “అదిరింది అల్లుడు”, “అమ్మ అమ్మను చూడాలని ఉంది”, “అమ్మ నాన్న కావాలి”, “అమ్మ దుర్గమ్మ”, “అర్ధాంగి”, “ఓహో నా పెళ్ళంట!”, “కాలేజీ స్టూడెంట్”, “గన్ షాట్”, “తాతా మనవడు”, “ఫ్యామిలీ”, “మమ్మీ మీ ఆయన వచ్చాడు”, “మా ఇంటి ఆడపడుచు”, “మెరుపు”, “లేడీస్ డాక్టర్”, “వజ్రం”, “వన్స్ మోర్”, “వార్నింగ్”, “వీరుడు”, “శ్రీకారం”, “శ్రీకృష్ణార్జున విజయం”, “సాంప్రదాయం”, “సరదా బుల్లోడు”, “సహనం”, “హలో నీకు నాకు పెళ్ళంట”, “అధికారి”, “అమలాపురం అల్లుడు”, “కాలేజీ గేట్”, “కింగ్”, “గ్యాంగ్ ఫైటర్”, “ఛాలెంజర్”, “ఢిల్లీ డైరీ”, “దాదా”, “నేటి సావిత్రి”, “పోలీస్ కమాండో”, “పోలీస్ పవర్”, “మేయర్ చక్రవర్తి”, “రిపోర్టర్”, “రౌడీ నాయకుడు”, “శివశక్తి”, “సర్కిల్ ఇన్‌స్పెక్టర్”, “సి.ఐ.డి”, “సుభాష్” వంటివి ఈ వర్గంలో ఉన్నాయి.
మొత్తంగా చూస్తే, 1996 తెలుగు సినిమా సంవత్సరంలో విజయాలు, అపజయాలు రెండూ ఉన్నాయి. కొన్ని చిత్రాలు ప్రజల హృదయాలను గెలుచుకుంటే, మరికొన్ని ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.