18 Pages Collection: లవ్ స్టోరీతోనూ కలెక్షన్స్ కుళ్లబొడుస్తున్నాడు.. నిఖిలూ నువ్వు తోపు గురూ

‘కార్తికేయ2’ వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్లో వచ్చిన మూవీ ఇది. దీంతో సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి.

18 Pages Collection: లవ్ స్టోరీతోనూ కలెక్షన్స్ కుళ్లబొడుస్తున్నాడు.. నిఖిలూ నువ్వు తోపు గురూ
18 Pages Movie

Updated on: Dec 25, 2022 | 7:31 PM

ప్రజంట్ టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు యంగ్ హీరో నిఖిల్. హ్యాపీడేస్‌తో కెరీర్ ఆరంభించి.. ఆపై హీరోగా మారి మంచి హిట్స్ అందుకుంటున్నాడు. మంచి మంచి కథలను చేసుకుంటూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకున్నాడు.  కార్తీకేయ2 సినిమాతో.. పాన్ ఇండియా హిట్టు కొట్టి.. నార్త్‌ జనాలతో కూడా వావ్ అనిపించుకున్నాడు. పనిలో పనిగా 100 కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయాడు. ప్రజంట్ స్టార్ హీరో రేసులో దూసుకుపోతున్నాడు. ఇక ఈ క్రమంలో తాజాగా రిలీజైన తన 18పేజెస్ సినిమాతో… నిఖిల్ తన సత్తా చాటాడు. మొదటి 2 రోజుల్లో.. డీసెంట్ కలెక్షన్స్ అందుకున్నాడు.

నిఖిల్ హీరోగా… పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ 18 పేజేస్. పాన్ ఇండియన్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ అందించారు. GA2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బన్నీ వాస్ నిర్మించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ వీకెండ్ రిలీజైన 18 పేజేస్ ఫస్ట్ డేనే… మంచి టాక్ తెచ్చుకుంది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ’18 పేజెస్’ మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి 2 రోజుల్లో రూ. 2.28 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 25 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 48 లక్షలు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 2 రోజుల్లో ఈ సినిమాకు రూ. 3.01 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.05 కోట్లు గ్రాస్ వసూలైంది. ఈ ఆదివారం ముగిసే సరికి మూవీ కలక్షన్స్ పెరిగే ఛాన్సులు ఉన్నాయి. 18 పేజెస్‌కు వరల్డ్ వైడ్ రూ. 12.00 కోట్లు మేర బిజినెస్ జరిగిందట. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.50 కోట్లుగా ఉంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 3.01 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 9.49 కోట్లు రాబడితేనే ఈ సినిమా మంచి హిట్ అయినట్లు లెక్క. ఆదివారం కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సినిమాకు మంచి టాక్ రావడంతో మూవీ టీం… క్రేజీ బ్లాక్‌ బాస్టర్ సక్సెన్స్ పార్టీని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేయడమే కాదు.. గీతా ఆర్ట్స్ లో వచ్చే సినిమా డైరెక్టర్స్ అండ్ హీరోస్, హీరోయిన్స్‌ ను ఈ పార్టీకి ఇన్‌వైట్ చేసి… తన ఫిల్మ్ సక్సెస్ పార్టీలో భాగం చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..