Amritha Aiyer: హ్యాకర్ల బారిన పడ్డ టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు!

ఇటీవల సినీ తారలకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లు తరచూ హ్యాకింగ్ (Hacking) కు గురవుతున్నాయి. కొందరు ఆకతాయిలు వీరి ఖాతాలను హ్యాక్ చేసి ఇతరులకు అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు పెడుతున్న సంఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Amritha Aiyer: హ్యాకర్ల బారిన పడ్డ టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు!
Amritha Aiyer

Updated on: Feb 02, 2022 | 12:38 PM

ఇటీవల సినీ తారలకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లు తరచూ హ్యాకింగ్ (Hacking) కు గురవుతున్నాయి. కొందరు ఆకతాయిలు వీరి ఖాతాలను హ్యాక్ చేసి ఇతరులకు అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు పెడుతున్న సంఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ (30 Rojullo Preminchadam Ela) ఫేమ్ అమృతా అయ్యర్( Amritha Aiyer) హ్యాకర్ల బారిన పడింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.  అయితే అదృష్టవశాత్తూ ప్రస్తుతానికైతే తన అకౌంట్ నుంచి ఎలాంటి అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెట్టలేదని తెలిపింది.  తన  ఖాతా మళ్లీ  తిరిగి తనకు రావాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్ లో పేర్కొంది అమృ. కాగా దీనిపై అమృత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

కాగా కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘బిగిల్ (తెలుగులో విజిల్)’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది అమృత. ఆ తర్వాత రామ్ నటించిన ‘రెడ్ ‘ సినిమాతో టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  ఇక యాంకర్ ప్రదీప్ తో కలిసి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.  ఇటీవల శ్రీవిష్ణుతో కలిసి ఆమె నటించిన ‘ అర్జున ఫాల్గుణ’ చిత్రానికి కూడా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది అమృత.

Also read: AP- Telangana: విద్యుత్తు బిల్లుల చెల్లింపులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదే.. తేల్చిచెప్పిన కేంద్రం..

Son Of India: మళ్లీ మొదలైన సినిమా జోష్.. మోహన్ బాబు సినిమాకు కూడా ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

Ekta Kapoor: ఆ సీరియల్ కోసం అంత బడ్జెటా?.. తీవ్ర ఒత్తిడిలో బిగ్‌బాస్ బ్యూటీ..