Singer Sunitha: అభిమానులకు క్షమాపణలు చెప్పిన అందాల సింగర్.. అసలు విషయం ఇదే..

అందాల సింగర్ సునీత అభిమానులకు క్షమాపణలు చెప్పింది. సునీత క్షమాపణ చెప్పడం ఏంటి అనుకుంటున్నారా.. తన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోసింది సునీత.

Singer Sunitha: అభిమానులకు క్షమాపణలు చెప్పిన అందాల సింగర్.. అసలు విషయం ఇదే..
Sunitha

Updated on: Mar 29, 2021 | 5:04 PM

Singer Sunitha: అందాల సింగర్ సునీత అభిమానులకు క్షమాపణలు చెప్పింది. సునీత క్షమాపణ చెప్పడం ఏంటి అనుకుంటున్నారా.. తన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోసింది సునీత. అచ్చమైన తెలుగు తనానికి చీరకట్టినట్టు ఉండే సునీత. ఎంతో మధురంగా పాటలను ఆలపిస్తూ.. ఎంతో మంది అభిమానులను సొంతంచేసుకుంది. టాలీవుడ్ లో ఏ లేడీ సింగర్ కు లేని క్రేజ్ సునీత సొంతం. ఇటీవలే రెండో వివాహం చేసుకున్న సునీత కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.

ఇక సునీత సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన పాటలకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా తన అభిమానులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ప్రముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజాలో ‘మణిశర్మ మ్యూజికల్ నైట్’ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో సునీత పాల్గొనాల్సి ఉంది. ‘క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇవాళ జ‌ర‌గాల్సిన మ‌ణిశ‌ర్మ మెగా మ్యూజిక‌ల్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. సునీత అందమైన గాత్రం విందామనుకున్న ఆమె అభిమానులు నిరాశపడ్డారు. దాంతో సోషల్ మీడియా వేదికగా సునీత అభిమానులకు క్షమాపణ చెప్పారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Raviteja: మెగాస్టార్ సినిమా స్పూర్తితో మాస్ రాజా మూవీ.. ఎక్స్ ట్రా ఎనర్జీతో కనిపించనున్న రవితేజ

Faria Abdullah: ఈ లేడీ జాతిరత్నానికి అలాంటి పాత్ర చేయాలని ఉందట.. షాక్ ఇచ్చిన ఫరియా

Prabhas New Car: హైదరాబాద్‌ రోడ్లపై కొత్త కారులో చక్కర్లు కొడుతోన్న ప్రభాస్.. కారు ధర ఎంతో తెలిస్తే..