గుజరాత్‌లో ఏం జరుగుతోంది..? నాకు ‘సెన్సిబుల్ ఇండియా’ కావాలి.. మోదీకి రష్మీ ప్రశ్న..!

గుజరాత్‌లో ఏం జరుగుతోంది..? నాకు 'సెన్సిబుల్ ఇండియా' కావాలి.. మోదీకి రష్మీ ప్రశ్న..!

ఏ విషయంలోనైనా.. తన దైశ శైలిలో రెస్పాన్స్‌ అవుతుంది జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్. అంతేకాదు ఆమె జంతు ప్రేమికురాలు కూడా. అలాగే.. తన గురించి ఎవరైనా.. అసభ్యకరమైన కామెంట్స్‌ చేసినా.. ఘాటుగా జవాబులు ఇస్తూ.. ఉంటుంది. తాజాగా.. ఇప్పుడు రష్మీ గౌతమ్.. గుజరాత్‌కు సంబంధించిన ఓ వీడియోపై ఫుల్ ఫైర్ అయింది. ఈ విషయంకు సంబంధించి డైరెక్ట్‌గా ప్రధాని నరేంద్ర మోదీకే పశ్నించింది. గుజరాత్‌కి సంబంధించి ఓ వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. చిరుతపులి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 15, 2019 | 2:04 PM

ఏ విషయంలోనైనా.. తన దైశ శైలిలో రెస్పాన్స్‌ అవుతుంది జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్. అంతేకాదు ఆమె జంతు ప్రేమికురాలు కూడా. అలాగే.. తన గురించి ఎవరైనా.. అసభ్యకరమైన కామెంట్స్‌ చేసినా.. ఘాటుగా జవాబులు ఇస్తూ.. ఉంటుంది. తాజాగా.. ఇప్పుడు రష్మీ గౌతమ్.. గుజరాత్‌కు సంబంధించిన ఓ వీడియోపై ఫుల్ ఫైర్ అయింది. ఈ విషయంకు సంబంధించి డైరెక్ట్‌గా ప్రధాని నరేంద్ర మోదీకే పశ్నించింది.

గుజరాత్‌కి సంబంధించి ఓ వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. చిరుతపులి పిల్లను పట్టుకుని కొందరు యువకులు దాన్ని హింసిస్తూ ఉన్నారు. గతంలో సింహాలను కూడా కొందరు యువకులు బంధించి హింసించారు. దీనిపై పీఎం మోదీని ట్యాగ్ చేస్తూ.. గుజరాత్‌లో ఏం జరుగుతోంది..? మనకు డిజిటల్ ఇండియా.. మోడర్న్ ఇండియాతో పాటుగా సెన్సిబుల్ ఇండియా కూడా కావాలి అంటూ.. ట్వీట్ చేసింది. నాకు వీడియో చూడాలన్నా భయం వేసింది.. అంతలా దాన్ని హింసిస్తున్నారు అంటూ.. ట్వీట్‌లో పేర్కొంది రష్మీ గౌతమ్. ఈ ట్వీట్‌పై రష్మీ ఫ్యాన్స్ లైకులు కొట్టి.. షేర్ చేస్తున్నారు. అయితే.. ఇక ఇప్పుడు ఈ విషయంపై మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu