Kajal Aggarwal: అరుదైన గౌరవం అందుకున్న టాలీవుడ్‌ చందమామ.. సంతోషంగా, గర్వంగా ఉందంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌..

ప్రముఖ టాలీవుడ్‌ నటి కాజల్‌ అగర్వాల్‌( Kajal Aggarwal)కు అరుదైన గౌరవం లభించింది.  కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసా (UAE golden visa)ను అందుకుందీ చందమామ.

Kajal Aggarwal: అరుదైన గౌరవం అందుకున్న టాలీవుడ్‌ చందమామ.. సంతోషంగా, గర్వంగా ఉందంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌..
Kajal Aggarwal

Updated on: Feb 04, 2022 | 8:32 PM

ప్రముఖ టాలీవుడ్‌ నటి కాజల్‌ అగర్వాల్‌( Kajal Aggarwal)కు అరుదైన గౌరవం లభించింది.  కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసా (UAE golden visa)ను అందుకుందీ చందమామ. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా (Social media) లో షేర్‌ చేసుకున్న కాజల్‌.. తనకు అరుదైన గౌరవం అందించినందుకు యూఏఈ మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. ‘యూఏఈ గోల్డెన్ వీసా లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మనలాంటి కళాకారులకు ఈ అరబ్‌ దేశం ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తోంది. నాకు ఈ గుర్తింపు ఇచ్చినందుకు యూఏఈ మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు. భవిష్యత్‌ లో కూడా మీ సహాయ సహకారాలు కొనసాగాలని కోరుకుంటున్నాను’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది.

క్రియేటివిటీ, పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్య సంపద తదితర రంగాల్లో సేవలందిస్తున్న వారికి దుబాయ్ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ వీసాను అందిస్తోంది. ఈ వీసాతో ఆ దేశంలో ఎంతకాలమైనా ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా నివాసం ఉండే వీలుంటుంది. ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ అందుకున్నాడు. ఆ తర్వాత సంజయ్ దత్, సునీల్‌ శెట్టి, సోనూ నిగమ్‌, నేహా కక్కర్‌, మౌనీ రాయ్‌, ఫరా ఖాన్‌, బోనీ కపూర్‌ కుటుంబం ఈ వీసా పొందింది. కాగా దక్షిణాదిలో మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, టోవినో థామస్‌, దుల్కర్‌ సల్మాన్‌, త్రిష, అమలాపాల్‌ ఈ వీసాను అందుకున్నారు. ఇటీవల మెగా కోడలు ఉపాసన కూడా ఈ గౌరవం దక్కించుకుంది. ఇక క్రీడా విభాగంలో సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ దంపతులు కూడా ఈ గోల్డెన్‌ వీసా అందుకున్నారు.

కాగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. కాజల్, కిచ్లూ దంపతులిద్దరూ ప్రస్తుతం తమ మొదటి సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి ఆమె నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read:PM Narendra Modi: రేపే హైదరాబాద్‌ కు ప్రధాని.. కేసీఆర్‌ స్థానంలో మోడీకి స్వాగతం పలకనున్న ఆ మంత్రి..

Pushpa: పాలిటిక్స్‌కు పాకిన పుష్ప ఫీవర్‌.. శ్రీవల్లి ట్యూన్‌తో యూపీలో ఎన్నికల ప్రచారం..

Budget 2022 : ‘అమృత కాలంలో అడుగు పెడుతోన్న నవ భారతానికి బూస్టర్ ఈ బడ్జెట్’..