
‘పుష్ప 1’, ‘పుష్ప 2’, ‘యానిమల్’ సినిమాలతో 1000 కోట్ల క్లబ్‌లో చేరి స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సౌత్ హీరోయిన్ రష్మికా మందన్నా. చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పుష్ప సినిమాలో శ్రీవల్లిగా చేసి నేషనల్ క్రష్‌గా మారింది. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే బాలీవుడ్‌కు వెళ్లింది.
రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన యానిమల్ సినిమాలో చాన్సస్ కొట్టేసింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. యానిమల్ సినిమాలోని నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది.
అయితే రష్మిక కంటే ముందే 1000 కోట్ల క్లబ్‌లో చేరింది లేడీ సూపర్‌స్టార్ నయనతార. తమిళంలో హరి దర్శకత్వంలో 2003లో వచ్చిన ‘అయ్యా’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నయనతార, ఇప్పటికీ దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలో నంబర్-1 హీరోయిన్‌గా కొనసాగుతోంది. 41 ఏళ్ల వయసులోనూ గ్లామర్, ఫిట్‌నెస్‌తో యంగ్ జెనరేషన్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ, పాన్-ఇండియా స్థాయిలో బిజీగా ఉంది. ఇప్పటివరకు నయన్ నటించిన 80 సినిమాల్లో టాప్-10 బ్లాక్‌బస్టర్స్..
షారుఖ్ ఖాన్ జోడీగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘జవాన్’ సినిమా రూ.1152 కోట్లతో భారత సినిమా చరిత్రలోనే అతిపెద్ద హిట్. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తమిళ హీరోయిన్‌గా నయనతార రికార్డు సృష్టించింది. విజయ్, అట్లీ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘బిగిల్’ (2019). ఫుట్‌బాల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా రూ.304 కోట్లు వసూలు చేసింది. చిరంజీవితో తెలుగులో నయన్ నటించిన అతిపెద్ద హిట్ ‘సైరా నరసింహారెడ్డి’ (2019). సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడిక్ డ్రామా రూ.248 కోట్ల వసూళ్లు రాబట్టింది.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దర్బార్’ (2020). ఈ సినిమా రూ.238 కోట్లు వసూలు చేసింది. అజిత్ కుమార్‌తో శివ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వాసం’ (2019). ఈ సినిమా రూ.187 కోట్లు వసూలు చేసింది. రజనీకాంత్‌తో శివ డైరెక్షన్లో వచ్చిన అన్నత్తే (2021) రూ.171 కోట్లతో ఆ సంవత్సరం తమిళంలో టాప్ గ్రాసర్‌గా నిలిచింది. చిరంజీవితో మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన లూసీఫర్ తెలుగు రీమేక్ ‘గాడ్‌ఫాదర్’ (2022). రూ.108 కోట్లు కలెక్ట్ చేసింది.
అజిత్‌తో విశ్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఆరంభం (2013) రూ.101 కోట్లు వసూలు చేసింది. చియాన్ విక్రమ్, డైరెక్టర్ ఆనంద్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇరుముగన్’ (2016) రూ.94 కోట్లు వసూలు చేసి నయన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. నయన్ కెరీర్ మొదట్లో చేసిన చంద్రముఖి (2005) రూ.89 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్-కామెడీ నయన్‌ను ఓవర్‌నైట్ స్టార్ చేసింది.
ఈ టాప్-10 సినిమాలు కలిపి రూ.2700 కోట్లకు పైగా వసూలు చేశాయి. నయన్ నటించిన టాప్ 10 సినిమాల్లో ఎక్కువగా చిరంజీవి, రజినీకాంత్ సినిమాలే ఉండటం విశేషం. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విజయ్, అజిత్, రజనీ, చిరంజీవి, షారుఖ్, ఎన్టీఆర్, బాలకృష్ణ, ప్రభాస్, శివకార్తికేయన్ లాంటి టాప్ స్టార్స్‌తో నటించి, ప్రతి ఇండస్ట్రీలోనూ తన ముద్ర వేసింది నయన్. ప్రస్తుతం ‘టెస్ట్’, ‘మూకుతి అమ్మన్-2’, ‘మన్నంగట్టి సిన్స్ 1975’ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉంది నయన్. తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మన వరప్రసాద్‌గారు వస్తున్నారు’ సినిమాలో నటిస్తోంది.