
చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించే ముందు అతడు సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ అని చెప్పాలి. 16 ఏళ్ల వయసులో కోటి రూపాయలు, 19 ఏళ్ల వయసులో 12 కోట్ల రూపాయలు సంపాదించిన ఆ నటుడు, హిందీ, తెలుగు, తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకులకు ప్రతినాయకుడిగా నటించాడు. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ మాజీ ప్రేమికుడైన ఆ నటుడి ప్రస్తుత నికర ఆస్తి విలువ ఎంత అని తెలిస్తే మీరు కచ్చితంగా షాకవుతారు. ఆ నటుడు మరెవరో కాదు అజిత్ నటించిన ‘వివేగం’ చిత్రంలో ఆయన ప్రతినాయకుడిగా నటించిన వివేక్ ఒబెరాయ్. ఇప్పుడు తమిళ, మలయాళ, తెలుగు భాషలలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆయన తొలి చిత్రం ‘కంపెనీ’ విడుదలై విజయం సాధించడంతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన వివేక్ ఒబెరాయ్, ఆ తర్వాత వరుసగా హిట్ చిత్రాలలో నటించి స్టార్ డమ్ సంపాదించుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..
వివేక్ ప్రముఖ నటుడు సురేష్ ఒబెరాయ్ కుమారుడు. అతను తన తండ్రి అడుగుజాడల్లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ, తక్కువ సమమయంలోనే పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత, అతను ‘సాదియా’, యువ, ఓంకార, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా, ఖుర్బాన్ వంటి అనేక చిత్రాలలో నటించాడు. ఈ చిత్రాల విజయం అతని స్టార్ హోదాను మరింత పెంచింది. అయితే, దురదృష్టవశాత్తు, 2003లో వివేక్ ఒబెరాయ్ నిర్వహించిన ఒక పత్రికా సమావేశం తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారాయి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..
సల్మాన్ తో బ్రేకప్ తర్వాత ఐశ్వర్య రాయ్ ,వివేక్ ప్రేమలో పడిందని అంటారు. ఒక విలేకరుల సమావేశంలో సల్మాన్ గురించి వివేక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అతడి కెరీర్ పడిపోయింది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న అతడు.. బిజినెస్ రంగంలో సక్కెస్స్ అయ్యాడు. ప్రస్తుతం ఆయనకు భారత స్టాక్ మార్కెట్‌లో తొమ్మిది కంపెనీలు ఉన్నాయి. ఆయన ప్రధాన వ్యాపారం రియల్ ఎస్టేట్. ప్రస్తుతం అతడి ఆస్తి రూ.1200 కోట్లు. గత పదేళ్లలో భారతదేశంలోని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం తాను వ్యక్తిగతంగా అమెరికా, యూకేల నుండి దాదాపు 40 మిలియన్ డాలర్లను సేకరించినట్లు ఆయన తెలిపారు. భారత కరెన్సీలో దీని విలువ రూ. 358 కోట్లు.
ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..
Vivek Oberoi. News
ఎక్కువ మంది చదివినవి : Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..
సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..