కరీంనగర్ జిల్లాలో ఆస్తి వివాదం ముదిరింది. కొడుకుకు గిఫ్ట్ డీడ్ చేసిన ఇంటిని తిరిగి ఇవ్వాలని కోరుతూ వృద్ధ తల్లిదండ్రులు తమ కొడుకు ఇంటి ముందు ధర్నాకు దిగారు. వృద్ధాప్యంలో ఆసరా లేకుండా కొడుకు ఇల్లు అమ్ముతూ బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నాడని అధికారులు జోక్యం చేసుకోవాలని వారు అభ్యర్థిస్తున్నారు.