అక్టోబర్ 15 నుంచి యూపీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. రూ.2,000 వరకు లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. చిరు వ్యాపారులకు రూ.2,000 పైన లావాదేవీలపై 0.4% MDR వర్తిస్తుంది, గరిష్టంగా రూ.300 ఛార్జీ ఉంటుంది. రైల్వే, ఇంధన రంగాల్లో రూ.2,000 దాటితే రూ.5 ఛార్జీ విధిస్తారు. 95% లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయి.