Balakrishna: ఆ విషయంలో యంగ్‌ హీరోలకు పోటీనిస్తోన్న బాలయ్య.. సోషల్‌ మీడియాలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌..

|

Jan 08, 2022 | 7:11 PM

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ధాలు గడుస్తోన్నా ఇప్పటికీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తనదైన మాస్‌ డైలాగ్‌లు, ఫైటింగ్‌లతో జై బాలయ్య అనిపించుకుంటున్నారు..

Balakrishna: ఆ విషయంలో యంగ్‌ హీరోలకు పోటీనిస్తోన్న బాలయ్య.. సోషల్‌ మీడియాలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌..
Follow us on

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ధాలు గడుస్తోన్నా ఇప్పటికీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తనదైన మాస్‌ డైలాగ్‌లు, ఫైటింగ్‌లతో జై బాలయ్య అనిపించుకుంటున్నారు. తాజాగా అఖండ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన నట సింహం తనలోని స్టామినా ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు. కరోనా తర్వాత టాలీవుడ్‌కు అసలైన విజయాన్ని రుచిచూపించారు బాలకృష్ణ. ఇక కేవలం హీరోగానే కాకుండా హోస్ట్‌గా మారి ఆహాలో ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకేతో డిజిటల్‌ ప్రేక్షకులను సైతం మెస్మరైజ్ చేశారు. ఇదిలా ఉంటే బాలకృష్ణకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

అఖండ చిత్రానికి బాలకృష్ణ రూ. 10 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ తన కొత్త చిత్రం కోసం ఏకంగా రూ. 20 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు బాలయ్య తన రెమ్యునరేషన్‌ను పెంచేసినట్లు చర్చజరుగుతోంది. బాలకృష్ణ క్రేజ్‌ను సొంతం చేసుకోవడానికి ఆ మాత్రం రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి చిత్ర యూనిట్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే బాలకృష్ణ ఈ చిత్రంతో పాటు మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

Also Read: Corona: టీకాలు వేస్తున్నా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. కారణమేంటో తెలుసా..?

Kitchen: ఈ 5 వస్తువులు కిచెన్‌లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. వెంటనే ఆరోగ్యం మెరుగవుతుంది..?

Lockdown In Telugu States: సంక్రాంతి తర్వాత లాక్ డౌన్ !! లైవ్ వీడియో