గర్జిస్తోన్న ‘సింహం రాజు’.. వందకోట్లకు చేరువలో

| Edited By:

Jul 27, 2019 | 12:06 PM

డిస్నీ సంస్థ మరో అద్భుత చిత్రం ద లయన్ కింగ్ గర్జన భారత బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వచ్చిన ఈ చిత్రం రెండో వారంలోనూ సత్తా చాటుతోంది. ఇప్పటివరకు 80కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ద లయన్ కింగ్.. వంద కోట్లకు చేరువలో ఉంది. ఇటీవల వచ్చిన స్పైడర్ మ్యాన్ వంద కోట్ల ఫీట్‌ను చేరుకునేందుకు మూడు వారాల సమయం పట్టగా.. లయన్ కింగ్ మాత్రం రెండు వారాల్లోనే వంద […]

గర్జిస్తోన్న ‘సింహం రాజు’.. వందకోట్లకు చేరువలో
Follow us on

డిస్నీ సంస్థ మరో అద్భుత చిత్రం ద లయన్ కింగ్ గర్జన భారత బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వచ్చిన ఈ చిత్రం రెండో వారంలోనూ సత్తా చాటుతోంది. ఇప్పటివరకు 80కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ద లయన్ కింగ్.. వంద కోట్లకు చేరువలో ఉంది. ఇటీవల వచ్చిన స్పైడర్ మ్యాన్ వంద కోట్ల ఫీట్‌ను చేరుకునేందుకు మూడు వారాల సమయం పట్టగా.. లయన్ కింగ్ మాత్రం రెండు వారాల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరబోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ చిత్రానికి కనెక్ట్ అవ్వడంతో.. కలెక్షన్స్‌లో దూసుకుపోతున్నాడు సింహం రాజు. దానికి తోడు ఆయా భాషల్లో ప్రముఖుల చేత చెప్పించిన డబ్బింగ్ కూడా అదనపు ఆకర్షణగా మారింది. దీంతో ప్రాంతీయ భాషల సినిమాలను తట్టుకొని కలెక్షన్లు వస్తున్నాయి.

కాగా హాలీవుడ్ చిత్రాలు ఇటీవల ఇండియాలో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా చిత్రాలు నిరూపించాయి. జంగిల్ బుక్, అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవేంజర్స్ ఎండ్ గేమ్, అల్లద్దీన్ వంటి చిత్రాలు భారత్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ను సాధించడంతో పాటు మంచి కలెక్షన్లను సాధించాయి.