పింక్ రీమేక్ ఆన్ ట్రాక్

|

Feb 16, 2019 | 5:42 PM

బాలీవుడ్ లో సూపర్‌హిట్ అయిన పింక్‌ సినిమాను అజిత్‌ హీరోగా సౌత్‌ లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ కనిపించిన పాత్రలో సౌత్‌లో అజిత్‌ నటించనున్నాడు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటి విద్యాబాలన్‌ మరో కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో అజిత్ కూడా పాల్గొననున్నాడు. కన్నడ […]

పింక్ రీమేక్ ఆన్ ట్రాక్
Follow us on

బాలీవుడ్ లో సూపర్‌హిట్ అయిన పింక్‌ సినిమాను అజిత్‌ హీరోగా సౌత్‌ లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ కనిపించిన పాత్రలో సౌత్‌లో అజిత్‌ నటించనున్నాడు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటి విద్యాబాలన్‌ మరో కీలక పాత్రలో నటించనున్నారు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో అజిత్ కూడా పాల్గొననున్నాడు. కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు హెచ్‌ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు.