Tollywood: టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్.. ఎందుకంటే..?

తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించింది. 30 శాతం వేతనాలు పెంచాలని.. వేతనాలు పెంచితేనే షూటింగ్‌లో పాల్గొంటామని తేల్చి చెప్పింది. వేతనాలు పెండింగ్ పెట్టకుండా ఏ రోజుకు ఆ రోజే ఇవ్వాలని డిమాండ్ చేసింది.

Tollywood: టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్.. ఎందుకంటే..?
Tollywood Shootings

Updated on: Aug 03, 2025 | 7:24 PM

తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించింది. 30 శాతం వేతనాలు పెంచాలని.. జీతాలు పెంచితేనే షూటింగ్‌లో పాల్గొంటామని తేల్చిచెప్పింది. వేతనాలు పెండింగ్ పెట్టకుండా ఏ రోజు జీతం ఆ రోజే ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇతర భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు ఇది వర్తిస్తుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఫిలిం ఛాంబర్‌తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ లేఖ విడుదల చేసింది. ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని.. ఎవరూ షూటింగ్స్‌లో పాల్గొనకూడదని తేల్చి చెప్పింది. షూటింగ్స్ ఎక్కడ జరిగిన ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

మరోవైపు రూల్స్ ప్రకారం కేవలం 5శాతం మాత్రమే జీతాలు పెంచుతామని నిర్మాతలు చెబుతున్నారు. కానీ నిర్మాతలు చెప్పినదానికి ఎంప్లాయిస్ ఫెడరేషన్ ససేమీరా అంటోంది. 30శాతం పెంచినవారికే షూటింగ్స్‌ చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం సెట్స్‌పై ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిర్ణయం డైరెక్టర్లు, నిర్మాతలకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.