ZEE Theatre: ‘సౌత్ స్పెషల్ థియేటర్’.. ‘జీ’ నుంచి మరో కొత్త కార్యక్రమం.. తెలుగు ప్రేక్షకులకు పండగే పండగ..

థియేటర్ మాయాజాలాన్ని టెలివిజన్ స్క్రీన్‌లపైకి తీసుకురావడంలో అగ్రగామిగా ఉన్న జీ థియేటర్ ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో అత్యంత ప్రజాదరణ పొందిన టెలిప్లేలు (సీరియల్స్‌, ధారావాహికలు) మళ్లీ ప్రసారం చేయనున్నట్లు జీ థియేటర్‌ తెలిపింది.

ZEE Theatre: సౌత్ స్పెషల్ థియేటర్.. జీ నుంచి మరో కొత్త కార్యక్రమం.. తెలుగు ప్రేక్షకులకు పండగే పండగ..
ZEE Theatre South Special Theatre

Updated on: Jul 05, 2023 | 7:03 PM

థియేటర్ మాయాజాలాన్ని టెలివిజన్ స్క్రీన్‌లపైకి తీసుకురావడంలో అగ్రగామిగా ఉన్న జీ థియేటర్ ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో అత్యంత ప్రజాదరణ పొందిన టెలిప్లేలు (సీరియల్స్‌, ధారావాహికలు) మళ్లీ ప్రసారం చేయనున్నట్లు జీ థియేటర్‌ తెలిపింది. ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా రూపొందించబడిన చారిత్రాత్మక కథనాలు, సస్పెన్స్ థ్రిల్లర్‌లు, లీగల్ డ్రామాలలో సార్వత్రిక సమస్యలు, సంఘర్షణలతో పోరాడుతున్న అనేక రకాల సాపేక్ష పాత్రలను మీరు చూడవచ్చు. గతంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘గుణేగర్’, ‘రిస్తోం కా లైవ్ టెలికాస్ట్’, అగ్నిపంఖ్’, ‘రాంగ్ టర్న్’, ‘సర్ సర్ సరళ’, ‘ఇంటర్నల్ అఫైర్స్ ‘, ‘మా రిటైర్ హోతీ హై’, ‘కోర్ట్ మార్షల్’, ‘సచ్ కహూన్ తో’ మరియు ‘శ్యామ్ కీ మమ్మీ’వంటి ధారావాహికలు జీ థియేటర్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి.

ఈ సందర్భంగా జీ స్పెషల్ ప్రాజెక్ట్స్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ శైలజా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘రంగస్థలం కేవలం ఒక భాష, ఒక ప్రాంతానికి పరిమితం కాదు. తెలుగు ప్రేక్షకులను కూడా మా టెలిప్లేలను అందుబాటులోకి తీసుకురావటానికి ఈ వ్యూహరచనను చేశాం. కామెడీ, కమర్షియల్, సామాజిక సందేశాలు.. ఇలా ఏ జోనర్‌నైనా తెలుగు రాష్ట్రాల అభిమానులకు దగ్గరచేసేందుకే మా ఈ ప్రయత్నం’ అని అన్నారు. కాగా ఈ ధారావాహికలను జీ థియేటర్‌ ఛానెల్‌లో జూలై 2023 నుండి ప్రతి శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2 గంటలు, అలాగే రాత్రి 8 గంటలకు ‘సౌత్ స్పెషల్ థియేటర్’ పేరుతో ప్రసారంకానున్నాయి. టాటా స్కైలో ఛానెల్‌ నం 316, డీటీహెచ్‌లో ఛానెల్‌ నం 214, డిష్‌ టీవీలో ఛానెల్‌ 356, ఎయిర్‌ టెల్‌ డిజిటల్‌ టీవీలో ఛానెల్‌ నంబర్‌ 191లో వీటిని చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి..