Vishnu Priya: ప్రముఖ బుల్లితెర నటి పుట్టినరోజు.. ఏకంగా అన్ని గ్రాముల బంగారాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త

బుల్లితెర ప్రేక్షకులకు నటి విష్ణుప్రియ (Vishnu Priya) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు అమ్మాయిలు, కుంకుమపువ్వు, నువ్వే కావాలి తదితర సీరియల్స్‌తో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైందీ అందాల తార.

Vishnu Priya: ప్రముఖ బుల్లితెర నటి పుట్టినరోజు.. ఏకంగా అన్ని గ్రాముల బంగారాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త
Actress Vishnu Priya

Edited By: Anil kumar poka

Updated on: Aug 28, 2022 | 9:37 AM

బుల్లితెర ప్రేక్షకులకు నటి విష్ణుప్రియ (Vishnu Priya) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు అమ్మాయిలు, కుంకుమపువ్వు, నువ్వే కావాలి తదితర సీరియల్స్‌తో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైందీ అందాల తార. వీటితో పాటు కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేస్తుంటుంది. సోషల్‌ మీడియాలోను చురుగ్గా ఉండే ఈ సొగసరి నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తుంటుంది. కాగా తన పుట్టిన రోజు సందర్భంగా భర్త, నటుడు సిద్ధార్థ్‌ వర్మ (Siddharth Varma) కలిసి షాపింగ్ చేసిందీ ముద్దుగుమ్మ. ఓ బంగారు ఆభరణాల దుకాణానికి వెళ్లి తనకు నచ్చిన గాజులు, నెక్లెస్‌, ఇయర్‌ రింగ్స్‌లను కొనుగోలు చేసింది. అనంతరం తన షాపింగ్‌కు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌ ద్వారా ఫ్యాన్స్‌ తో పంచుకుంది. ‘నా బర్త్‌ డేకి మావారి బంగారు కానుక’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కాగా తన పుట్టిన రోజుకు 200 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్లు ఈ వీడియోలో చెప్పుకొచ్చింది విష్ణుప్రియ. కాగా భార్య సెలెక్ట్‌ చేసిన ఆభరణాలను జాగ్రత్తగా దగ్గరుండీ ప్యాక్‌ చేయించి బిల్లు చెల్లించాడు ఆమె భర్త సిద్ధార్థ్‌. బంగారం లాంటి తన భార్య పుట్టిన రోజుకు ఈ మాత్రం గోల్డ్‌ ఇవ్వలేనా అని చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..