
ఎన్టీఆర్ కి ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్..ఆ వెంటనే ‘అల వైకుంఠపురములో’తో బన్నీకి కూడా మ్యాజికల్ హిట్ అందించాడు. తాజాగా తారక్ తో మరోసారి చేతులు కలిపిన మాటల మాంత్రికుడు…ప్రస్తుతం కథను సానబడుతున్నాడు. ఈ మూవీకి మే నుంచి డేట్స్ ఇస్తానని ఎన్టీఆర్ చెప్పాడు. దాంతో త్రివిక్రమ్ కథ ఫాస్ట్ గా కంప్లీట్ చెయ్యాల్సిన రావడంతో..ఒత్తిడి ఫీలయినట్టు తెలుస్తోంది.
కానీ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ వల్ల ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ నిలిచిపోవడంతో ఎన్టీఆర్ జులై వరకు బిజీగా ఉండబోతున్నాడని అర్థమైంది. దీని వల్ల త్రివిక్రమ్ కథపై పూర్తిగా మనసుపెట్టే అవకాశం లభించింది. ఎన్టీఆర్ కి ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాబోయే చిత్రం అంటే అంచనాలు గగనానికి అంటుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి గురూజీ ఏ రేంజ్ స్క్రిప్ట్ తో తారక్ అభిమానుల మనసు దోచుకుంటాడో చూడాలి.