
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇటీవలే ముగిసింది. కామనర్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్ పడాల బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. చివరి వరకు విన్నర్ అవుతుందనుకున్నతనూజ రెండో ప్లేసుతో సరిపెట్టుకుంది. డిమాన్ పవన్ మూడో ప్లేసుతో బయటకు వెళ్లిపోయాడు. ఈ సీజన్ లో అత్యంత దురదృష్టవంతుడు ఎవరంటే జబర్దస్త్ ఇమ్మాన్యుయేలే అని చెప్పుకోవచ్చు. సీజన్ ప్రారంభం నుంచి హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగాడు ఇమ్మూ. ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటాడు. తన కామెడీతో ఆడియెన్స్ కు మస్త్ వినోదం అందించాడు. ఒకానొకదశలో ఇమ్మూనే బిగ్ బాస్ విన్నర్ అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. కానీ చివరకు నాలుగో ప్లేసుతో సరిపెట్టుకున్నాడు. ఇది ఇమ్మూ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన జబర్దస్త్ రోహిణి, ముక్కు అవినాశ్ కూడా ఈ విషయంపై స్పందించారు. కమెడియన్స్ ఎప్పటికీ బిగ్ బాస్ విన్నర్స్ అవ్వలేరంటూ కామెంట్స్ చేశారు. తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ ఓ ఇంటర్వ్యూలో దీనిపై రియాక్ట్ అయ్యాడు. కమెడియన్స్ బిగ్ బాస్ విన్నర్స్ అవ్వలేరు అనే వ్యాఖ్యలపై ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
‘ సినిమాలో హీరోలు గెలిస్తే అందరూ సూపర్ అంటారు. కానీ కమెడియన్ గెలిస్తే అంతగా పట్టించుకోరు. కమెడియన్ అంటే అలా ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇమ్మాన్యుయేల్ దానికి అతీతుడు అని నాకు అనిపించింది. బిగ్ బాస్ లో గేమ్స్ పరంగా, టాస్కుల పరంగా అతను నెక్స్ట్ లెవల్ లో ఆడాడు. అయితే ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్ లోకి ఎక్కువగా రాకపోవడం వల్ల వాడికి ఓట్ బ్యాంక్ అనేది ఫామ్ అవ్వలేదు. అది అతనికి బిగ్గెస్ట్ మైనస్. బిగ్ బాస్ లో జరిగే కంటెంట్ చూసి జనాలు ఓట్ వేస్తారు. నామినేషన్స్ లో ఉంటే ఓట్ వేస్తారు. ఒకవేళ లేకపోతే ఆ ఓట్ వేరే వాళ్లకు వేస్తారు . ఇక్కడ అదే హాజరిగింది. ఒకవేళ ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్ లో ఉండి ఉంటే ఇమ్మాన్యుయేల్ ని మించిన విన్నర్ లేడు’ అని టేస్టీ తేజ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.