SP Balu: మీ అమృత గానానికి మరణం లేదు.. వర్థంతినాడు ఎస్పీ బాలును స్మరించుకుంటున్న నెటిజన్స్

|

Sep 25, 2021 | 4:16 PM

SP Balasubrahmanyam First Death Anniversary: మనుషులకు మరణం ఉంటుంది.. కళాకారులు మరణించినా చిరంజీవులే.. లె జెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తన జీవిత ప్రయాణం నుంచి..

SP Balu: మీ అమృత గానానికి మరణం లేదు.. వర్థంతినాడు ఎస్పీ బాలును స్మరించుకుంటున్న నెటిజన్స్
Sp Balu Memories
Follow us on

SP Balasubrahmanyam First Death Anniversary: మనుషులకు మరణం ఉంటుంది.. కళాకారులు మరణించినా చిరంజీవులే.. లె జెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తన జీవిత ప్రయాణం నుంచి సెలవు తీసుకుని భువి నుంచి దివికి వెళ్లి నేటికి ఒక సంవత్సరం అయ్యింది. బాలు మొదటి వర్ధంతి సందర్భంగా.. సినీ సంగీత అభిమానులు, బాలు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక నివాళులర్పిస్తున్నారు.  బాలుని జ్ఞాపకం చేసుకుంటూ.. ఆయన పాడిన పాటల్లో తమకు ఇష్టమైనవాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.  ఉదయం నుంచి ట్విట్టర్‌లో #SPBalasubrahmanyam అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.  ఎస్పీబీ కోవిడ్ -19 తో పోరాడి సెప్టెంబర్ 25, 2020 న మరణించారు.

చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.  ఆగష్టు 2020 లో బాలసుబ్రమణ్యంకు కోవిడ్ -19 ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స లో కరోనావైరస్ నెగటివ్ పరీక్షించినప్పటికీ.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపించింది. చివరకు బాలు ఊపిరితిత్తుల వైఫల్యంతో మరణించారు. ఈరోజు, సెప్టెంబర్ 25,  మొదటి వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నారు. ఆయన పాడిన పాలు హల్ చల్ చేస్తున్నాయి. పాటకు అంతం లేదు. ఇది మనతో ఎప్పటికీ ప్రయాణిస్తుంది.. మీరు భౌతికంగా మాత్రమే మమ్మల్ని విడిచి వెళ్లారు.. మీ అమర స్వరం కాదు అంటూ అభిమానులు బాలుని జ్ఞాపకం చేసుకుంటున్నారు.

ఫ్యాన్స్  చేసిన  కొన్ని ట్వీట్లు: 

 

 

 

 

Also Read: SP Balu Death Anniversary: తెలుగు సినీ వినీలాకాశంలో చెరగని సంతకం ఎస్పీ బాలు.. గాన గంధర్వుడి జీవితంలో ముఖ్య విశేషాలు

SP Balu Death Anniversary: అంతర్యామీ అలసితి అంటూ “పాటగా బతకనా మీ అందరి నోట” అని దివికేగిన ఎస్పీ బాలు ప్రథమ వర్ధంతి నేడు..