Singer Chitra: పాటలే కాదు.. డైలాగ్స్ చెప్పడంలోనూ అదుర్స్.. సింగర్ చిత్ర నోట బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్..

|

Jul 28, 2021 | 9:27 PM

ఆమె గొంతు వింటే అలసటను మర్చిపోయి.. ప్రశాంతత అవంచుకోవాల్సిందే. కోపాన్ని చిరునవ్వుగా మార్చేస్తుంది. సంగీతానికి భాష

Singer Chitra: పాటలే కాదు.. డైలాగ్స్ చెప్పడంలోనూ అదుర్స్.. సింగర్ చిత్ర నోట బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్..
Singer Chitra
Follow us on

ఆమె గొంతు వింటే అలసటను మర్చిపోయి.. ప్రశాంతత అవంచుకోవాల్సిందే. కోపాన్ని చిరునవ్వుగా మార్చేస్తుంది. సంగీతానికి భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం అంటూ భారతీయ చలన చిత్ర పరిశ్రమకి తన గాత్రంతో నవరసాల్ని పరిచయం చేశారు గాయని చిత్ర. పాడలేను పల్లవైనా భాషరాని దానను (సింధుభైరవి చిత్రంలోని గీతం) అంటూనే తన మాతృభాష మలయాళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ పాటలు పాడారు. తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, తుళు భాషల్లోనూ ఆమె ఆలపించారు. అన్ని భాషలు కలిపి దాదాపు 20 వేలకు పైగా పాటల్ని ఆలపించారు సింగర్ చిత్ర. అయితే చిత్ర తెర వెనక తన గాత్రాన్ని అందించడమే కానీ.. ఎక్కువగా తెరపై కనిపించరు. తాజాగా ఓ బుల్లితెర షోలో పాల్గోన్న చిత్ర.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రమహ్మణ్యం వలన తెలుగు నేర్చుకున్నానని చెప్పారు. అలాగే తన పాప పేరు మీద స్థాపించిన ట్రస్ట్ ద్వారా 60 ఏళ్లకు పైబడి వారికి ఫించన్లు అందిస్తున్నట్లుగా చెప్పారు. అయితే పాటలే కాదు… డైలాగ్స్ కూడా చెప్పి అదుర్స్ అనిపించారు. చెయ్యి చూడు ఎంత రఫ్‌గా ఉందో, రఫ్పాడించేస్తా అని చిరంజీవి డైలాగ్ తో ఆకట్టుకున్నారు. ఇక ఆ తర్వాత బాలకృష్ణ డైలాగ్ ఫ్లూటు జింక ముందు ఊదు సింహం కాదు వంటి పవర్‌ఫుల్‌ డైలాగ్ ను తనదైన స్టైల్‏లో చెప్పి వావ్ అనిపించారు. ఇక ఆ తర్వాత తన కెరీర్‏లో ఒకే రోజులో 16 పాటలు పాడినట్లు చెప్పుకొచ్చారు. ఆ రోజు అమ్మ తనపై కోప్పడిందని తెలిపారు. ఇక తను సినిమాలలో పాడుతుంటే వాళ్ల నాన్నగారు చూడాలనుకున్నారని.. కానీ జాతీయ అవార్డు తీసుకునే సమయంలో తన తండ్రి లేకపోవడం చాలా బాధకలిగించిందని చెప్పుకొచ్చారు.

Also Read: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశాలు..వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Viral Video: ఫుల్ ట్రాఫిక్‏లో రోడ్డుపై అడ్డంగా బైక్ పెట్టిన వ్యక్తి.. అయినా అతడు చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..