
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రధాన పాత్రల కంటే ఎక్కువగా విలన్ పాత్రలకే మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అంతేకాదు.. పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలు పోషించేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా ఓ సీరియల్ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీరియల్స్ వదిలేసి సినిమా షూటింగ్ కోసం వెళ్తే.. అక్కడ తనకు ఓ పెద్ద హీరో అసభ్యకరమైన ఫోటో చూపించాడని తెలిపింది. ఇలాంటివాటితోపాటు కమిట్మెంట్స్ సైతం అడుగుతున్నారని.. అందుకే తాను బుల్లితెరపై సెటిల్ అయినట్లు తెలిపింది. ఆమె పేరు సంధ్య జాగర్లమూడి.
తమిళంలో వంశం, చంద్రలేఖ, సంధ్యరాగం వంటి సీరియల్స్ ద్వారా క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగులో అమ్మాయి కాపురం సీరియల్ చేసింది. ఇప్పుడు మేఘసందేశం సీరియల్లో విలన్ పాత్రలో నటిస్తుంది. కానీ గ్లామర్ లుక్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినీరంగం గురించి సంచలన కామెంట్స్ చేసింది.
” నేను తెలుగులో పలు సినిమాల్లో నటించాను. కానీ తమిళంలో సినిమాలు చేయలేదు. సినిమాకు మేము సరిపోం. అందుకు కారణం నా మనస్తత్వమే. అందరితో త్వరగా కలవను. సీరియల్ అంటే సంవత్సరాల తరబడి షూటింగ్ ఉంటుంది. కానీ సినిమా అలా కాదు. నేను డబ్బు కోసం ఇండస్ట్రీకి వచ్చాను. అందుకే సినిమా కంటే సీరియల్ బెటర్. కొంతమంది సర్దుబాటు చేయగలరా అని ఫోన్ లో నేరుగా అడుగుతారు. సినిమా తీస్తున్నారా.. లేదా మరేదైనా చేస్తున్నారా అని అడిగాను. అలా అడిగినప్పుడు చాలాసార్లు కోపం వచ్చేది. సర్దుబాటు చేయమని అడిగిన వ్యక్తిని నీకు అమ్మ, చెల్లి లేరా అని అడిగితే.. నీలాంటి అందమైన భార్య లేదు అన్నాడు. అప్పటినుంచి అలా అడగడం మానేశాను ” అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే ‘తమిళంలో ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లాను. అక్కడ పెద్ద హీరోను చూసి ఎంతో మర్యాదగా ప్రవర్తించాను. నేను అతడి పక్కన కూర్చున్నాను.. ఫోన్ లో ఏదో చూస్తు నవ్వుతున్నాడు. నాకు చూపిస్తూ.. ఇది చాలా కామెడీగా ఉందని ఆ ఫోటో చూపించాడు. అది చాలా అసభ్యకరమైన ఫోటో. వెంటనే కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాను ‘ అని తెలిపింది.
Sandhya New
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..