Samantha : ఇలా తగులుకున్నారేంట్రా.. మొన్న నిధి.. ఇప్పుడు సమంత.. సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్..

ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ కు రాజా సాబ్ ఈవెంట్ అనంతరం చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే ఇప్పుడు సమంతకు సైతం అలాంటి అనుభవమే ఎదురైంది. ఒక్కసారిగా సెల్ఫీల కోసం జనాలు ఎగబడ్డారు. దీంతో సామ్ ఇబ్బంది పడ్డారు. బాడీగార్డ్స్ సాయంతో జాగ్రత్తగా కారు ఎక్కి ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Samantha : ఇలా తగులుకున్నారేంట్రా.. మొన్న నిధి.. ఇప్పుడు సమంత.. సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్..
Samantha

Updated on: Dec 22, 2025 | 8:07 AM

రోజూ రోజుకీ అభిమానుల అత్యుత్సాహంతో హీరోయిన్లు ఇబ్బందిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవలే ది రాజాసాబ్ సాంగ్ రిలీజ్ వేడుకలో హీరోయిన్ నిధి అగర్వాల్ ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే సమంతకు సైతం అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాజాగా హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమంతను అభిమానులు చుట్టుముట్టారు. ఇటీవలే డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సామ్.. మొదటిసారి పబ్లిక్ ముందుకు వచ్చింది. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం కార్ వద్దకు వెళ్తున్న సమంత సెల్ఫీ కోసం జనాలు ఎగబడ్డారు.

ఇవి కూడా చదవండి :  Actress : ఎక్కువగా కనిపించాలని ఆ డైరెక్టర్ ప్యాడింగ్ చేసుకోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

దీంతో ఎంతో జాగ్రత్తగా సమంతను కారు వరకు తీసుకురావడానికి బాడీగార్డ్స్ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆ వీడియోలో ఫ్యాన్స్ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో సమంత ఇబ్బందిపడినట్లు కనిపిస్తుంది. ఇటీవల సెలబ్రెటీల పట్ల పెరుగుతున్న ఈ అభిమానంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో అభిమానుల తీరుపై మండిపడుతున్నారు. మొన్న నిధి అగర్వాల్.. ఇప్పుడు సమంత ఇద్దరికీ ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవాలే ఎదురయ్యాయి.

ఇవి కూడా చదవండి :  Jabardasth Emmanuel : చాలా వదులుకుని బిగ్‏బాస్ వరకు.. విన్నర్ కావాల్సినోడు.. ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ ఎంతంటే..

ఇదెలా ఉంటే.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. శుభం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో కీలకపాత్రలో మెరిసిన సామ్.. అటు నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే డిసెంబర్ 1న డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది సామ్. కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో వీరిద్దరూ భూత శుద్ధి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సామ్ తిరిగి తన కెరీర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :  Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..

ఇవి కూడా చదవండి :  Bigg Boss 9 Telugu : బిగ్‏బాస్ విజేతగా కళ్యాణ్ పడాల.. ప్రైజ్ మనీతోపాటు ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా.. ?