AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్‌కు ఆయువుపట్టు మోనిత.. ఈ సీరియల్‌కు గుడ్‌బై చెప్పేసిందా.. !

Karthika Deepam: తెలుగు బుల్లి తెరపై సంచలనం సృష్టిస్తూ.. మూడేళ్లకు పైగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది కార్తీక దీపం సీరియల్.. ఈ సీరియల్ కు కేవలం మహిళలే  కాదు.. పురుషులు కూడా అభిమానులే.. అత్యంత ఆదరణ పొందిన..

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్‌కు ఆయువుపట్టు మోనిత.. ఈ సీరియల్‌కు గుడ్‌బై చెప్పేసిందా.. !
Monita
Surya Kala
|

Updated on: Aug 10, 2021 | 9:47 AM

Share

Karthika Deepam: తెలుగు బుల్లి తెరపై సంచలనం సృష్టిస్తూ.. మూడేళ్లకు పైగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది కార్తీక దీపం సీరియల్.. ఈ సీరియల్ కు కేవలం మహిళలే  కాదు.. పురుషులు కూడా అభిమానులే.. అత్యంత ఆదరణ పొందిన ఈ సీరియల్ లో ప్రతి పాత్ర ఆదరణ సొంతం చేసుకుంది. దీప వంటలక్క క్యారెక్టర్ కి అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఇక డాక్టర్ బాబు, సౌందర్య, ఆనందరావు, అర్ధపావు భాగ్యం, ఆదిత్య, విలన్ మోనిత నుంచి పనిమనిషి ప్రియమణి వరకూ ఫేమస్ పాత్రలే.. ఆయా క్యారెక్టర్లలో సదరు నటీనటులు ఓడిపోయి నటిస్తూ.. బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నవారే.. 16 ఏళ్ల ప్రేమ అంటూ మోనిత క్యారెక్టర్ లో నటిస్తున్న శోభా శెట్టి.. విలనిజం గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాను ప్రేమించిన కార్తీక్ ని దక్కించుకోవడం కోసం.. ఎంతటికైనా తెగించే పాత్రలో నటిస్తూ జీవిస్తున్న శోభా శెట్టి.. కార్తీక దీపం సీరియల్ కు గుడ్ బై చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

మోనిత గురించి కార్తీక్ కు పూర్తిగా తెలిసింది. మోనిత ప్రేమ పేరుతో చేసిన ఘోరాలు.. నేరాలు తెలుసుకున్న కార్తీక్.. చంపేసినట్లు చూపించారు. దీంతో మోనిత పాత్రను ఈ సీరియల్ నుంచి కొన్నాళ్ళు తప్పించారా.. లేక నిజంగా చంపేసి.. ఆ క్యారెక్టర్ కు గుడ్ బై చెప్పేశారా అనే అనుమానాలు సీరియల్ ఫ్యాన్స్ లో కనిపిస్తున్నాయి. అయితే శోభా శెట్టి.. కన్నడలో ఫేమస్ యాక్టర్.. దీంతో ఆమెకు అక్కడ నాలుగైదు సీరియల్స్ లో నటిస్తూ.. ఫుల్ బిజినట.. ముఖ్యంగా తెలుగులో ప్రసారమవుతున్న దేవత సీరియల్ కన్నడ భాషలో రుక్కు పాత్రలో (శోభా శెట్టి) మోనిత నటిస్తుంది. దీంతో కన్నడ, తెలుగు లో కాల్ షీట్స్ ను కేటాయించలేకపోతుంది.. అందువల్లనే కార్తీకదీపం సీరియల్ నుంచి రెండు నెలలు పాటు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ క్యారెక్టర్ లేకుండా కార్తీక దీపం ని నడిపిస్తారని.. మోనిత నిజంగా చచ్చిపోయిందా.. లేక యధావిధిగా నాటకం మొదలు పెట్టిందా అనే కోణంలో సీరియల్ సాగనున్నదని తెలుస్తోంది. అయితే రెండు నెలల అనంతరం మోనిత క్యారెక్టర్ లో శోభా శెట్టి తిరిగి వస్తుందా.. లేక మొత్తని కి గుడ్ బై చెప్పేస్తే.. ఆ పాత్రలో మరొక నటి వస్తుందా అని తెలియాల్సి ఉంది.

Also Read: Types Of Walking: ప్రశాంతమైన మూడ్‌లో చేస్తే మంచి ఫలితాలు ఇచ్చే వాకింగ్‌ ఎన్ని రకాలో తెలుసా..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!